YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మంత్రిగారికి సెబ్ సెగ

మంత్రిగారికి సెబ్ సెగ

ఒంగోలు, మార్చి 1,
ఆ మంత్రికి సెబ్‌ సెగ గట్టిగానే తాకిందా? సెబ్‌ అధికారులు మంత్రిని పట్టించుకోవడం లేదా? అమాత్యులవారు చెప్పినా వినకుండా.. ఆయన అనుచరుడినే లోపల వేసేశారా? అందుకే ఆయన నిప్పులు చెరిగారా? ఎవరా మంత్రి? ఏమా కథ?మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రకాశం జిల్లాల్లో ఆయన చెప్పిందే వేదం.. శాసనం. అలాంటి మంత్రిని కూడా పట్టించుకోవడం లేదట ఓ ప్రభుత్వ విభాగం. అదే.. ఎక్సైజ్‌ శాఖ పరిధిలో పనిచేసే స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో.. సెబ్‌. ఒంగోలు అభివృద్ధిపై పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి బాలినేని. ఆ మీటింగ్‌కు సెబ్‌ అధికారులు కూడా వచ్చారు. ఆ విభాగం వంతు వచ్చేసరికి మంత్రి ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారట. దాంతో మంత్రి ఎందుకు ఆ స్థాయిలో కోప్పడ్డారు అనేదానిపై ఒక్కటే గుసగుసలు వినిపిస్తున్నాయిఅక్రమ మద్యాన్ని అరికట్టడంతోపాటు అక్రమ ఇసుక తరలింపునూ అడ్డుకునే అధికారం సెబ్‌కు అప్పగించారు. ఆ మధ్య కొత్తపట్నం మండల పరిధిలో ఇళ్ల నిర్మాణానికి ఇసుక తెచ్చుకుంటున్న రైతుపై కేసు పెట్టారట. గ్రామస్థులు రోజంతా ఆందోళన చేయడంతో సెబ్‌ అధికారులకు అప్పుడే వార్నింగ్‌ ఇచ్చారట మంత్రి బాలినేని. అలాగే జిల్లాలో ఎక్కువ అక్రమ మద్యం కేసులు నమోదవుతున్నాయని ఒక సందర్భంలో సీఎం జగన్‌ మంత్రితో అన్నారట. ఇదే సమయంలో కొత్తపట్నం మండలం మడనూరుకు చెందిన మంత్రి ముఖ్య అనుచరుడిపైనే సెబ్ అధికారులు కేసు నమోదు చేయడంతో పరిస్థితి వేడెక్కింది. అది బాలినేనికి మరింత ఆగ్రహం కలిగించినట్టు సమాచారం. వాస్తవానికి గ్రామంలో ఎవరి వాహనాలనైనా సెబ్‌ అడ్డగిస్తే మంత్రి బాలినేనితో మాట్లాడి విడిపించే బాధ్యత ఆ అనుచరుడిదేనట. అలాంటి వ్యక్తిపైనే కేసు పెట్టడంతో సంచలనంగా మారింది.ఆ కేసు విషయంలో సెబ్‌ అధికారులను మాత్రమే పిలిచి ప్రశ్నిస్తే లేనిపోని రచ్చ అవుతుందని అనుకున్నారో ఏమో.. ఒంగోలు సమీక్ష పేరుతో అన్ని ప్రభుత్వ విభాగాలను మంత్రి సమావేశానికి పిలిచినట్టు టాక్‌. ఆ సమీక్షలో సెబ్‌ వంతు రాగానే బాలినేని బరస్ట్‌ అయ్యారని అనుకుంటున్నారు. మంత్రి ముఖ్య అనుచరుడిపై కేసు నమోదు చేసిన సమయంలో గ్రామస్థులంతా ఏకమై సెబ్‌ సీఐ లతతోపాటు పలువురు అధికారులను రౌండప్‌ చేశారట. ఉదయం నుంచి సాయంత్ర వరకు సమస్య తేలకపోవడంతో వాహనాలను అక్కడే వదిలేసి వెళ్లిపోయారట సెబ్‌ అధికారులు. ఆ ఘటనపై సీఐ లత ఫిర్యాదు చేయడంతో కేసు కట్టేశారట. ఆ ఘటనపై మంత్రి బాలినేని ఫోన్‌ చేసినా సెబ్‌ అధికారులు స్పందించలేదట. ముఖ్య అనుచరుడిపైనే కేసు నమోదు చేసి అమాత్యుల వారికి షాక్‌ ఇచ్చారు సెబ్‌ అధికారులు.ఆ కేసుతో లోకల్‌ అధికారపార్టీ నేతల రగిలిపోతున్నారట. మంత్రి బాలినేని మాట్లాడినా కేసు నమోదైతే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. అధికారపార్టీకి చెందిన తమ వాహనాలపైనే కేసు పెడితే.. గ్రామాల్లో తలెత్తుకుని ఎలా తిరుగుతామని నిలదీసినట్టు తెలుస్తోంది. ఆ ఎఫెక్ట్‌ వల్లే మీటింగ్‌లో సెబ్‌ అధికారులపై మంత్రి బాలినేని నిప్పులు చెరిగారని ప్రచారం జరుగుతోంది. ఈ ఎపిసోడ్‌లో అధికారులు మంత్రిని లైట్‌ తీసుకోవడం.. ఆయన మంత్రి అయితే మాకేంటని వ్యవహరించడం చర్చగా మారింది. మంత్రి చెప్పినా వినకపోవడం.. ఆయన ఫోన్‌ చేసినా స్పందించకపోవడం సెగలు రేపుతున్నట్టు సమాచారం. మరి.. ఈ ఎపిసోడ్‌ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో.. మంత్రిగారి ఆగ్రహం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.

Related Posts