YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

భక్తిశ్రద్దలతో మహశివరాత్రి

భక్తిశ్రద్దలతో మహశివరాత్రి

ఏలూరు
ప్రసిద్ధి శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరం గ్రామంలో వేంచేసియున్న త్రిలింగ క్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచిన రామేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది..స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజాదికాలు నిర్వహించారు అర్చకులు.. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లో బారులు తీరారు..
పరశురాముడు ప్రతిష్టించిన శివలింగ నిజరూప దర్శనాన్ని దర్శించేందుకు తెల్లవారుఝామునుండే భక్తులు  పోటెత్తారు.. స్వామివారిని దర్శించుకుంటే సకల అభీష్టాలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అని  ఆలయ ప్రధాన  అర్చకులు తెలిపారు.

Related Posts