YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కొత్త నిబంధనాలతో ఉపాధి హామీ

కొత్త నిబంధనాలతో ఉపాధి హామీ

శ్రీకాకుళం, మార్చి 2,
పాధి హామీలో కొత్త నిబంధనలు కూలీలకు తలనొప్పిగా మారాయి. గ్రూపుల ఏర్పాటులో జాప్యం కారణంగా పూర్తిస్థాయిలో పనులు కల్పిస్తారో, లేదో అన్న సందేహం తలెత్తుతోంది. ఉపాధి నిధుల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసు (టిసిఎస్‌) సాఫ్ట్‌వేర్‌ స్థానంలో నేషనల్‌ ఇన్ఫర్మేటిక్‌ సెంటర్‌ సాఫ్ట్‌వేర్‌ కేంద్రంగా అమల్లోకి తెచ్చింది. దీంతోపాటు మరికొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. దాని ప్రకారం పనులు కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 38 మండలాల పరిధిలో 1096 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 6.24 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. 44,400 గ్రూపుల ద్వారా 1.92 కోట్ల మందికి ఉపాధి కల్పించే వారు. ఈ ఏడాది 2.48 కోట్ల మందికి పని కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించారు. గతంలో సుమారు 20 మంది సభ్యులు ఒక్కో గ్రూపులో ఉండేవారు. వారికి ఒక మేట్‌ ఉండగా, గ్రూపు సభ్యులతో కలిసి పనులు చేసేవారు. నూతన నిబంధనల ప్రకారం పాత గ్రూపులను రద్దు చేసి కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ గ్రూపులకు మహిళలను మేట్లుగా నియమిస్తారు. గ్రూపు సభ్యులతో కలిసి మేట్‌లు ఎటువంటి పనులు చేయకుండా గ్రూపు సభ్యుల హాజరు తదితర అంశాలను పర్యవేక్షిస్తూ మొబైల్‌ ద్వారా మేట్లు అందించాల్సి ఉంటుంది. వీరికి వేతనాన్నీ ఇవ్వనున్నారు.సుమారు 80 నుంచి 120 మంది కూలీలతో ఒక గ్రూపు ఏర్పాటు చేయాల్సి ఉంది. కనీసం ఏడో తరగతి ఉత్తీర్ణత సాధించిన మహిళను ఒక్కో గ్రూపునకు మేట్‌గా నియమించే ప్రక్రియ సాగుతోంది. ఇది పూర్తయిన తర్వాత కూలీలకు పూర్తిస్థాయిలో అధికారికంగా పనులు కల్పించాల్సి ఉంది. అయితే ఇక్కడే అసలు సమస్య ఎదురవుతోంది. గ్రూపుల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో పూర్తిస్థాయిలో పనులు కల్పించలేని పరిస్థితి నెలకొంది. గత నెల 18వ తేదీ వరకు జిల్లాలో మూడు వేల గ్రూపులు మాత్రమే ఏర్పడ్డాయి. మిగిలిన గ్రూపులు పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ జిల్లాలో వేగవంతం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మండలాల్లో గ్రూపుల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి, పనుల కల్పనపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. కొత్త నిబంధనల ప్రకారం గ్రూపులు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ప్రతిఒక్కరికీ పని కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఉపాధి హామీ అధికారులు చెప్తున్నారు.

Related Posts