YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పాదయాత్రలో దశ మారుతుందా

పాదయాత్రలో దశ మారుతుందా

హైదరాబాద్, మార్చి 2,
కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టి విక్రమార్క ఈసారి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. గతంలో సైకిల్ ర్యాలీలు,మోటార్ బైక్ ర్యాలీలు, ఎడ్ల బండ్ల ర్యాలీలను నిర్వహించిన భట్టి విక్రమార్క ఈసారి ఏకంగా పాదయాత్రకు రంగం సిద్ధం చేశారు. ఆదివారం నుంచి మధిర నియోజకవర్గం వ్యాప్తంగా ఈ యాత్ర సాగనుంది. ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు నియోజకవర్గ సమస్యలను దృష్టికి తీసుకుని వెళ్లేందుకు యాత్రను చేపట్టనున్నారు. భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించారు. అయితే ఇంకా నియోజకవర్గంలో తన పట్టు పోకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అక్కడ టీఆర్ఎస్ పార్టీకి నాయకుడే లేకుండా పోయినప్పటికీ ఉన్న నాయకులు భట్టి విక్రమార్కను ఎదుర్కొనే శక్తి లేకుండా చేయగలిగారు. అయినప్పటికి సంతృప్తి చెందకుండా నియోజకవర్గంలో ఏ మాత్రం తన పట్టు చేజారి పోకుండా చూసుకుంటున్నారు.రాష్ట్రంలో ఏ పథకం వర్తింప చేసిన అది తన నియోజకవర్గానికి వచ్చేలా చూసుకుంటారు విక్రమార్క. గత ఎన్నికల్లో భట్టి విక్రమార్కను ఓడించడానికి అధికార పార్టీ గట్టి ప్రయత్నాలే చేసింది. అయినప్పటికీ ఆయన గెలిచి తన సత్తా ఏంటో చాటుకున్నారు. అది కూడా హ్యాట్రిక్ సాధించారు. గతంలో ఎమ్మెల్సీగా పని చేసిన భట్టి విక్రమార్క ఆతరువాత మధిర నియోజకవర్గం నుంచి ఎంఎల్ఎగా పోటీ చేస్తున్నారు. మూడుసార్లు అక్కడ నుంచి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న భట్టి విక్రమార్క ఆ పార్టీ ఢిల్లీలో చక్రం తిప్పుతుంటారు. అదే కోవలో జిల్లాలో ర్యాలీలను చేయడంలో దిట్టగా పేరు పొందారు. గతంలో ట్రాక్టర్ ర్యాలీలు, ఎడ్ల బండ్ల ర్యాలీలు, మోటార్ సైకిల్, సైకిళ్ల మీద ర్యాలీలను చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఈ ర్యాలీలు ఉపయోగపడతాయని ఆయన అభిలాష.మధిర నియోజకవర్గంలోని ముదిగొండ, చింతకాని, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని 32 రోజుల పాటు 506 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. ప్రతి మండలంలో 7 రోజుల వరకు ఈ యాత్ర ఉండనుంది. గత కొంత కాలం క్రితం చింతకాని మండలానికి చెందిన మరియమ్మ లాకప్ డెత్ వ్యవహారంలో తాను తీసుకున్న ఉద్యమం వల్ల ఆ కుటుంబానికి ఉద్యోగం రావడమే కాకుండా లాకప్ డెత్ కు బాధ్యులైన వారిని డిస్మిస్ చేయించగలిగారు.అదే విధంగా దళిత బంధు పథకం కూడా ముందు తన నియోజకవర్గాన్ని ఎన్నికయ్యేలా ప్రభుత్వంపై వత్తిడి తీసుకుని వచ్చి చేయించగలిగారు. దీంతో నియోజకవర్గంలో భట్టి విక్రమార్కకు మంచి పట్టు లభించింది. అధికారపార్టీ ఎటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ అన్ని పథకాలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.మళ్లీ పాదయాత్ర పేరుతో ప్రజకు మరింత చేరువయ్యేలా భట్టి విక్రమార్క ఈ యాత్ర ను చేపడుతున్నారు. ముదిగొండ మండలం యడవల్లి గ్రామం నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. అయితే ఎర్రుపాలెం మండలం జమలాపురం వద్ద ఈ యాత్ర ముగింపు చేయనున్నారు. యాత్ర ముగింపు సందర్బంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి జాతీయ నాయకులను ఆహ్వానించాలని కూడా భట్టి విక్రమార్క ప్లాన్ చేస్తున్నారు. ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను పెంచాలని భట్టి విక్రమార్క భావిస్తున్నారు.

Related Posts