కరీంనగర్, మార్చి 2,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, మంథని మాజీ ఎమ్మెల్యే దివంగత దుద్దిల్ల శ్రీపాద రావు 85వ జయంతి సందర్భంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీపాద రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అమర్ రహే శ్రీపాద రావు అమర్ రహే.. శ్రీపాద రావు ఆశయాలను సాధిద్దాం..అంటూ నినాదాలు చేశారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయం గేటు ఎదుట 500 మందికి అన్నదాన కార్యక్రమం చేశారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ శ్రీపాద రావు అజాత శత్రువుగా, తెలుగుదేశం ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిన నేపథ్యంలో ఆనాడు కాంగ్రెస్ కార్యకర్తలకు నేనున్నానంటూ ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కొండంత అండగా నిలిచి వారికి ధైర్యాన్ని ఇచ్చిన గొప్ప నేత అని శ్రీపాద రావు సేవలను కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంథని ఎమ్మెల్యేగా, శాసనసభ స్పీకర్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం, కోల్ బెల్ట్ పారిశ్రామిక ప్రాంతంలో ఘననీయమైన అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నాయకులు వైద్యుల అంజన్ కుమార్, ఎండి తాజ్, శ్రవణ్ నాయక్, మడుపు మోహన్, లింగంపెల్లి బాబు, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, కుర్ర పోచయ్య, దండి రవీందర్, ముక్కా భాస్కర్, నిహల్ అహ్మద్, సత్యనారాయణ రెడ్డి, ఏజ్రా, రోళ్ల సతీశ్, ఎండి. సలీముద్దీన్ పోరండ్ల రమేష్, ఎండి.చాంద్, ఆకుల రాము, విక్టర్, మొసళ్ళ రాంరెడ్డి, శహింషా, ఎర్ర శ్రీనివాస్, జీడీ రమేశ్, అజ్మత్, తదితరులు పాల్గొన్నారు.