అమరావతి
నాబార్డ్ వార్షిక రుణ ప్రణాళికపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష చేపట్టారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నాబార్డ్ చైర్మన్ జీఆర్ చింతల, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, కోవిడ్ లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వ్యవసాయ రంగం మద్దతుగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో చేస్తున్న పలు కార్యక్రమాలకు నాబార్డ్, బ్యాంకులు సహాయపడుతున్నాయన్నారు. కోవిడ్ సమయంలో చాలా మంచి సహాయాన్ని అందించాయన్నారు. రైతు భరోసా, సున్నావడ్డీ రుణాలు, రైతులకు ఉచిత పంటల బీమా ఇవన్నీ అమలు చేస్తున్నామని సీఎం అన్నారు.