కరీంనగర్
జ్ఞాన సముపార్జనకు పుస్తకాలు ఎంతగానో దోహదపడతాయని, పుస్తకాలు చదవడం వల్ల నే ఎందరో గొప్ప వ్యక్తులు గా మారారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.... అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బుక్ ఫేర్, తెలంగాణ బుక్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జ్యోతిరావు పూలే పార్క్ లో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ పుస్తకాలకు జీవం పోయాల్సిన అవసరం ఉందని అన్నారు. కవులు, కళాకారుల ఖిల్లా కరీంనగర్ జిల్లా అని తెలిపారు పుస్తకం సమాజాన్ని మార్చుతుందని పుస్తకాలు చదవడం వల్లనే ఎందరో వ్యక్తులు గొప్పవారు కాగాలిగారని అన్నారు...పుస్తక ప్రదర్శనలో 50 స్టాళ్లలో ఏర్పాటుచేసిన 20 వేల పుస్తకాలను విద్యార్థులు, మహిళలు, ప్రజలు తిలకించి తమకు నచ్చిన ఏదైనా ఒక పుస్తకం కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు.