కర్ణాటకలో హోరా హోరీగా ఎన్నికల జోరు కొనసాగుతుంది. ఇప్పటి వరకు వచ్చినా ట్రెండ్స్ ప్రకారం బీజేపీ ఆధిక్యంలో ఉంది. మరోవైపు, గాలి సోదరుల అడ్డా అయిన బళ్లారి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు భద్రతాచర్యల్లో భాగంగా 144 విధించినట్టు జిల్లా ఎస్సీ రంగరాజన్ తెలిపారు. జిల్లాలో 74.13 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.