YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మాజీలకు మంచి డిమాండ్...

మాజీలకు మంచి డిమాండ్...

విశాఖపట్టణం, మార్చి 3,
ఆయన చిరంజీవి ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన నేత. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో విశాఖ రూరల్ జిల్లా ప్రెసిడెంట్ గా కూడా పనిచేసిన కీలక నేత. విశాఖ రాజధాని కోసం టీడీపీకి, పార్టీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. సీనియర్ నేతగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు విశాఖ జిల్లాలో బలమైన కాపు సామాజికవర్గం నేతగా ఉన్నారు. ఆయన మృదు స్వభావి. పైగా పారిశ్రామికవేత్త. చిత్తశుద్ధితో పార్టీ అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తారు అన్న ముద్ర ఆయన మీద ఉంది. అందుకే జగన్ మెచ్చి మరీ పార్టీ కండువా కప్పారు.విశాఖ జిల్లా రాజకీయాన్ని పూర్తిగా ఒడిసిపట్టాలని భావిస్తున్న జగన్ మొత్తం సామాజిక వర్గాలను పార్టీ వైపుగా తిప్పుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే విశాఖ మేయర్ యాదవులకు కేటాయించిన జగన్ మంత్రి పదవిని కాపు సామాజిక వర్గానికి చెందిన అవంతి శ్రీనివాసరావుకు ఇచ్చారు. అదే కోవలో విశాఖ జిల్లా అధ్యక్ష పదవిని పంచకర్ల రమేష్ బాబుకు ఇవ్వాలనుకుంటున్నారు. ఆయనకు ఇవ్వడం ద్వారా కాపులను ఇటు వైపుగా పూర్తిగా తిప్పుకోవాలన్నది జగన్ ఆలోచనగా ఉంది.పంచకర్ల రమేష్ బాబుని పూర్తిగా యాక్టివ్ చేయడం ద్వారా వైసీపీని విశాఖ సిటీలో బలోపేతం చేయాలన్నది జగన్ మార్క్ ప్లాన్ అంటున్నారు. ఆయన సేవలను పూర్తిగా వినియోగించుకుంటూనే తగిన సమయంలో ఆయన్ని సరైన సీట్లో పోటీకి పెట్టాలన్నది జగన్ ఆలోచనగా ఉందిట. పంచకర్ల సైతం ముఖ్యమంత్రి ఏ పదవి అప్పగించినా తాను చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు. దాంతో ఆయనకు పార్టీ సారధిగా అవకాశం ఇస్తారని, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం బాధ్యతలను అప్పగిస్తారని అంటున్నారు.విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు అంటే కాబోయే ఎంపీ అని కూడా అంటున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ని తెచ్చి విశాఖ పార్లమెంట్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. యాదవ సామాజికవర్గానికి చెందిన ఆయనని వచ్చే ఎన్నికల్లో ఎంపీగా బరిలోకి దింపాలనుకుంటోంది. దానికి విరుగుడుగా జగన్ కూడా కాపు కార్డుని బయటకు తీస్తున్నారు అంటున్నారు. పంచకర్లను 2024లో జరిగే ఎంపీ ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలోకి దించుతారు అన్న టాక్ ఉంది. ఆ విధంగా అయితే విశాఖలో అత్యధిక సంఖ్యలో ఉన్న కాపులకు కూడా న్యాయం చేసినట్లు అవుతుందని, ఎంపీ సీటు కచ్చితంగా గెలుచుకుంటామని జగన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారట. మొత్తానికి టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీలందరికీ జగన్ భవిష్యత్తులో కీలకమైన పదవులు అప్పగిస్తారని ప్రచారం అయితే సాగుతోంది.

Related Posts