YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

పూర్తి కావస్తున్న సెనగ పైరు కోతలు

పూర్తి కావస్తున్న సెనగ పైరు కోతలు

అదిలాబాద్, మార్చి 3
రబీ సీజన్‌లో పండించిన శనగ పైరు కోతలు పూర్తవుతున్నాయి. దాదాపు 30శాతం పంట అన్నదాతల ఇంటికొచ్చింది. ఈ నేపథ్యంలో పంటను విక్రయించేందుకు రైతులు సిద్ధమయ్యారు. కానీ, మార్కెట్‌లో కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. గతేదాడి కూడా ఇలాగే కొనుగోళ్లు ఆలస్యమవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత్యంతరం లేక తక్కువ ధరకే ప్రయివేటులో విక్రయించారు. అలాంటి పరిస్థితి ఈ ఏడాదీ పునరావృతం కాకుండా మార్కెట్‌లో కొనుగోళ్లను త్వరగా ప్రారంభించాలని కోరుతున్నారు. ఇప్పటికే పత్తి, సోయా తదితర పంటల దిగుబడులు భారీగా తగ్గిపోవడంతో రైతులు కుదేలయ్యారు. కనీసం రబీలో పండించిన శనగ పంటైనా కొంత చేదోడుగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో అఖిలపక్ష రైతు సంఘాల ప్రతినిధులు మార్కెట్‌లో శనగ కొనుగోళ్లు ప్రారంభించాలని ఆర్డీఓకు వినతిపత్రం అందించారు.ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ రబీ సీజన్‌లో సుమారు 1.25 లక్షల ఎకరాల్లో శనగ పండించారు. ఒక్క ఆదిలాబాద్‌ జిల్లాలోనే 85 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఈ లెక్కన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 6.25 లక్షల క్వింటాళ్ల శనగ పంట దిగుబడి వస్తుందని అంచనా. ఇప్పటికే సుమారు 30 శాతం పంట కోతలు పూర్తికావడంతో రైతులు ఇండ్లలో నిల్వ చేసుకుంటున్నారు. వారం రోజుల్లో కోతలు పూర్తవుతాయి. కొందరు రైతులు ఇండ్లలో స్థలం లేక.. మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో పంటను పొలాల్లోనే పెట్టి రాత్రి, పగలు కాపలా కాస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం శనగకు క్వింటాల్‌కు రూ.5,230 మద్దతు ధర ప్రకటించింది. కానీ కొనుగోళ్లు ప్రారంభించారు. పత్తి, సోయా వంటి పంటల దిగుబడులు చాలా వరకు తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మార్కెట్‌లో పత్తికి మంచి ధర పలికినా ఆశించిన మేర పంట దిగుబడి రాలేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అన్నదాతలను రబీలో వేసిన శనగ పంటైనా గట్టెక్కిస్తుందనే ఆశతో ఉన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే మద్దతు ధరకు విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు రబీ సీజన్‌లో శనగ పంటను ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఆలస్యంగా కొనుగోలు చేసింది. జిల్లాలో తొమ్మిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం క్వింటాల్‌కు మద్దతు ధర రూ.5100గా నిర్ణయించింది. కానీ మార్కెట్‌లో దాదాపు నెల రోజులు కొనుగోళ్ల జాప్యం కారణంగా చాలా మంది ప్రయివేటు వ్యాపారులకు చాలా తక్కువ ధరకు విక్రయించాల్సి వచ్చింది. మధ్య దళారులకు విక్రయించడంతో ధర నష్టంతో పాటు తరుగు, తేమ పేరిట కోతలు విధించారు. మార్కెట్‌లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అప్పట్లో రైతులు, రైతు సంఘాల ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. రైతులు రోడ్డెక్కి ఉద్యమిస్తే కానీ ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోళ్లను ప్రారంభించలేదు. ఈ ఏడాదీ అలాంటి పరిస్థితి రాకూడదని రైతు సంఘాల ప్రతినిధులు భావిస్తున్నారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా త్వరగా కొనుగోళ్లు ప్రారంభించాలని కోరుతున్నారు.రబీ సీజన్‌లో పండించిన శనగ పంటను ప్రభుత్వం త్వరగా కొనుగోలు చేయాలి. ఇప్పటికే చాలా వరకు కోతలు పూర్తయి పంట రైతుల ఇండ్లకు చేరింది. మార్కెట్‌కు తీసుకొచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. గతేడాది కొనుగోళ్లు ఆలస్యం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తక్కువ ధరకు ప్రయివేటులో విక్రయించాల్సి వచ్చింది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి రానీయకుండా మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంట కొనుగోళ్లను ప్రారంభించాలి.

Related Posts