YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మైండ్ గేమ్ లో కేసీఆర్

మైండ్ గేమ్ లో కేసీఆర్

హైదరాబాద్, మార్చి 3, 
బీజేపీని మరింత దూకుడుగా ఢకొీట్టేందుకు గులాబీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ విధానాల విషయంలో ఒంటికాలిమీద లేస్తున్న సీఎం కేసీఆర్‌, ఇక ఆ పార్టీని ఉపేక్షించేది లేదనే సంకేతాలు ఇస్తున్నారు. ఆ పనిని తీవ్రతరం చేసేముందు రాష్ట్రంలో తన, తన పార్టీ ప్రస్తుత పరిస్థితి ఏంటో ఒకసారి చెక్‌ చేసుకోవాలని భావించారు. ఆమేరకు వారం క్రితం సర్కారీ వేగుల(ఇంటెలిజెన్స్‌)తో ఫీల్డ్‌ సర్వే చేయించారు. స్పెషల్‌ టాస్క్‌ ఇచ్చి మరీ పోలీసులను గ్రామాలు, మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో తిప్పారు. వారం రోజులు నిర్వీరామంగా ఆయా తరగతుల ప్రజలను ఇంటెలిజెన్స్‌ పోలీసులు కలిశారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఈ తరహా సర్వేలను సాధారణంగా చేయించుకుంటూనే ఉంటాయి. అయితే ప్రత్యేకంగా ఇప్పుడెందుకు ? అనే సందేహాం సహజంగానే రావచ్చు. ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్‌కిషోర్‌ డైరెక్షన్‌లో రాజకీయ వ్యూహాల అమలుకు కేసీఆర్‌ సిద్ధమవుతున్నారు. ఇటీవల ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌ను ప్రశాంత్‌కిషోర్‌ కలిసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ వ్యవహారాల వరకు, ఇంటెలిజెన్స్‌ సర్వే విషయాలు సైతం చర్చకొచ్చినట్టు టీఆర్‌ఎస్‌ శ్రేణులు చెబుతున్నాయి. బీజేపీని ఎదుర్కోనేందుకు గట్టిపోరాటమే చేయాలని భావిస్తున్న తరుణంలో సొంతబలాన్ని అంచనా వేసుకుని గోదాలోకి దిగితే బాగుంటుందనే తలంపుతో ఫీల్డ్‌ సర్వేకు మొగ్గారు. ప్రత్యేక పోలీస్‌ బృందాలతో సుమారు వారం రోజులపాటు జిల్లాల్లోని ఆయా తరగతుల ప్రజలను జల్లెడపట్టారు. ఈ సందర్భంగా అనేక అంశాలను అధ్యయనం చేసినట్టు తెలిసింది. రాష్ట్రంలో ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయమేది ముందుకు రాలేదని సర్వేలో తెలినట్టు సమాచారం. 2023 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే మళ్లీ అధికారం దక్కుతుందనేది నిఘాల వర్గాల సీక్రెట్‌ రిపోర్టు. ఆ నివేదికలోనే కాంగ్రెస్‌ రెండోస్థానంలోకి ఎగబాకినట్టు పోలీసులు అంచనా వేశారు. అలాగే బీజేపీకి ఉన్న అడుగు కూడా సడలినట్టు గుర్తించారు. ఎలాగైనా తెలంగాణను తమ ఖాతాలోకి వేసుకోవాలనుకున్న బీజేపీకి ఇది నిజంగా షాకింగ్‌ న్యూసే. మోడీకి అవసరమయ్యే లోక్‌సభ సీట్లల్లో ఎదురుగాలి వీస్తున్నట్టు సమాచారం. రాజధానిలోని ఒక్క సీటులో కొంత సానుకూలత ఉన్నా, మిగతా మూడు సీట్లల్లో పూర్తి వ్యతిరేకత ఉన్నట్టు ఇంటెలిజెన్స్‌ రిపోర్టు సారాంశం. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జైలుకుపోయినా సానుకూల పవనాలు వీయట్లేదని ఇంటెలిజెన్స్‌ వర్గాలు ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టులోపేర్కొన్నట్టు తెలిసింది. రాష్ట్రాన్ని అన్ని విధాలా ఎండబెడుతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కేసీఆర్‌ ఇటీవల కాలంలో తీవ్రంగా విరుచుకుపడుతన్న సంగతి తెలిసిందే. ప్రజల నాడీని తెలుసుకున్నాక ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా ? వెళితే పరిస్థితి ఏంటి ? కేటీఆర్‌ను సీఎం చేసే అవకాశాలను సైతం కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు. ఢిల్లీలో ప్రత్యామ్నాయం పేరుతో మోడీకి చెక్‌పెట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర బీజేపీపై అమిత్‌షాకు పట్టు ఉన్నప్పటికీ, ఆ పార్టీ నాలుగు వర్గాలుగా చీలిపోయినట్టు పత్రికల్లో వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ముందస్తు ఎన్నికల ఆలోచన సైతం కేసీఆర్‌ మైండ్‌లో ఉన్నప్పటికీ, ఏమేరకు వర్కవుట్‌ అవుతుందోననే సంశయంలో ఆయన సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం.

Related Posts