హైదరాబాద్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేసేందుకు కుట్ర పై టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పందించారు. ఒక రాష్ట్ర మంత్రి పై హత్య కుట్ర చేయడం దారుణం. కుట్రలోని పాత్ర దారులు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో ఎలా ఉన్నారని అయన ప్రశ్నించారు. జితేందర్ రెడ్డికి వారికి సంబంధం ఏంటి. కిడ్నప్ ల గురించి మాజీ మంత్రి డీకే అరుణకు ముందే ఎలా తెలుసు. మా ప్రభుత్వం ఇలాంటి చర్యలను కుట్రలను ఉపేక్షించేదు. దోషులు ఎంతటి వారు అయిన శిక్ష తప్పదు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి పనులు చేయడం సిగ్గు చేటు. సెక్షన్ 212 ప్రకారం నిందితులకు షెల్టర్ ఇచ్చిన వారూ కూడా దోషులే. డీకే అరుణ,జితేందర్ రెడ్డి ల పై కేసులు పెట్టాలని డీజీపీ, సిపి లను కోరుతున్ననని అన్నారు. దోషులకు బీజేపీ షెల్టర్ ఇవ్వడం సిగ్గు చేటు. తెలంగాణ లో ఇలాంటి పనికి మాలిన రాజకీయాలు నడవవని అయన అన్నారు.