YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు పోరాడుతా

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు పోరాడుతా

మంథని,
మంథని లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు పోరాడుతనని బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునిల్ రెడ్డి అన్నారు.  గురువారం మంథని పట్టణంలోని పోచమ్మ వాడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లో లబ్ధిదారులకి చెందవలసిన  ఇండ్ల పంపిణీలో  జరిగిన అవకతవకలను  చంద్రుపట్ల సునిల్ రెడ్డి  పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ  కాంగ్రెస్, టిఆర్ఎస్  నాయకులు చేసిన తప్పులకు  పేద ప్రజలు బలై పోతున్నారని   అన్నారు. ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన  దుద్దిళ్ల శ్రీధర్ బాబు , మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత జడ్పీ చైర్మన్  ప్రజాప్రతినిధులుగా పని చేస్తూ కూడా ఏమాత్రం పేద ప్రజల సంక్షేమం గురించి ఆలోచించకుండా సొంత మనుషులకు  టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చే విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులు గా ఎంపిక చేయడం జరిగిందని  విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రామ్ రెడ్డి హయాంలో సర్వే నెంబర్1520 లో 10 ఎకరాల భూమిని తీసుకొని ప్లాంటింగ్ చేసి పోచమ్మ వాడ పేదలకు ఇవ్వాలని సంకల్పించారని అప్పటినుండి  ఈ ఫ్లాట్ల  విషయంలో రకరకాల ఇబ్బందులు జరుగుతున్నాయని ఏ ప్రజా ప్రతినిధి  పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
డబల్ బెడ్రూమ్ ఇల్లు  నిజమైన  అర్హులైన పేద ప్రజలకు చెందే వరకు ఈ పోరాటం ఆగబోదని బిజెపి ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని, ఎమ్మార్వో, ఎంపీడీవో, కలెక్టర్లకు  బాధితుల పక్షాన వినతి పత్రం అందజేస్తున్న అన్నారు. ఈ కార్యక్రమంలో  మంథని పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదాశివ్, పట్టణ ప్రధాన కార్యదర్శి సబ్బని సంతోష్,  సీనియర్ నాయకులు సత్య ప్రకాష్, నాంపల్లి రమేష్, బోగోజు శ్రీనివాస్, కోరబోయిన మల్లికార్జున్, రాపర్తి సంతోష్, పోతారవేణి క్రాంతి కుమార్, సాగర్ఎడ్ల,  చిట్టావేని హరీష్,కాసర్ల సూర్య, తదితరులు పాల్గొన్నారు.

Related Posts