YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆపాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆపాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం

న్యూయార్క్‌ మార్చ్ 3
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆపాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది. ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని సమర్ధిస్తూ చేసిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ఆమోదించింది. అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, అఫ్గానిస్థాన్‌, ఐర్లాండ్‌ సహా 141 సభ్య దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటువేశాయి. దీనిని నాలుగు దేశాలు వ్యతిరేకించాయి. అయితే ఉక్రెయిన్ విషయంలో ఐరాసలో జరిగిన ఓటింగ్‌కు భారత్ మరోసారి దూరంగా ఉన్నది రష్యాకు వ్యతిరేకంగా నిర్వహించిన ఈ ఓటింగ్‌కు భారత్‌ సహా 35 దేశాలు పూర్తిగా దూరంగా ఉన్నాయి. కాగా, మెజార్టీ దేశాలు అనుకూలంగా ఓటువేయడంతో తీర్మానం ఆమోదం పొందినట్లు ఐరాస జనరల్‌ అసెంబ్లీ ప్రకటించింది. ఉక్రెయిన్‌పై యుద్ధంలో అణ్వాయుధాలను సిద్ధం చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. యుద్ధాన్ని విరమించి ఇరుదేశాల మధ్య శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చేయాలని సూచించింది.
ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై భారత్‌ మొదటి నుంచే తటస్థంగా వ్యవహరిస్తున్నది. ఇరుపక్షాలు శాంతియుత మార్గంలో, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచిస్తున్నది. అయితే ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు దూరంగా ఉంటూ వస్తున్నది. ఇటీవల ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన రెండు తీర్మానాలపై ఓటింగ్‌కు భారత్ గౌర్హాజరైన విషయం తెలిసిందే.

Related Posts