భువనేశ్వర్ మార్చ్ 3
కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో పెద్దమొత్తం లో బంగారం పట్టుబడింది. ఎలాంటి ధృవపత్రాలు లేకుండా తరలిస్తున్న 32 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 16 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో ముంబై – భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో జీఆర్పీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నలుగురి ప్రయాణికుల నుంచి 32 కిలోల గోల్డ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే బంగారు ఆభరణాలను తరలిస్తున్న వ్యక్తులు జీఎస్టీ డాక్యుమెంట్లు చూపలేదు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఒడిశా జీఎస్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అప్పగించారు. ఈ నలుగురు ముంబైకి చెందిన హస్ముఖ్‌లాల్ జైన్, సురేశ్ సహదేవ్ ఖారే, మహేశ్ భోమ్సార్, దీపక్ పటేల్ గా పోలీసులు గుర్తించారు. మొత్తం నాలుగు బాగ్యుల్లో 8 కిలలో చొప్పున బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు