న్యూ ఢిల్లీ మార్చ్ 3
ఉక్రెయిన్‌పై రష్యా క్రమంగా పట్టు సాధిస్తున్నది. క్షిపణులతో విరుచుకుపడుతున్న రష్యన్ దళాలు ఉక్రెయిన్‌కు దక్షిణాన ఉన్న నల్ల సముద్రం ఒడ్డున ఉన్న ఖెర్సన్.. వశంచేసుకున్నాయి. ఉక్రెయిన్‌లో ఖెర్సన్ ప్రధాన రేవు పట్టణం. ఖెర్సన్ నగరాన్ని రష్యా ఆక్రమించుకున్నట్లు ఉక్రెయిన్ ధ్రువీకరించింది. ఇక్కడ సుమారు మూడు లక్షల మంది నివాసముంటున్నారు. కాగా, రష్యా ఇప్పటికే అణువిద్యుత్ కేంద్రమైన చెర్నోబిల్ ప్లాంటును, అణు ఇంధన కర్మాగారాన్ని స్వాధీనం చేసుకున్నది. ఇక మర్యుపోల్ నగరాన్ని రష్యా బలగాలు చుట్టుముట్టగా, రాజధాని కీవ్‌కు మరింత చేరువయ్యాయి. వరుసగా ఎనిమిదో రోజూ ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తున్నది. కీవ్, ఖార్కివ్ నగరాల్లో క్షిపణులతో విరుచుకుపడుతున్నది. జనావాసాలు, విద్యాసంస్థలు, దవాఖానలపైనా రష్యా సైన్యం దాడులు చేస్తున్నది. ఖార్కివ్‌లోని పోలీసు, యూనివర్సిటీ భవనాలపై బాంబులతో విరుచుకుపడుతున్నది. కాగా, ఇప్పటివరకు 498 మంది సైనికులు చనిపోయినట్లు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి తన సైనికులు చనిపోయినట్లు రష్యా ప్రకటించడం ఇదే మొదటిసారి.