విజయవాడ, మార్చి 4,
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 7వ తేదీన ప్రారంభంకాబోతున్నాయి.. ఈ సమావేశాల్లోనే వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది సర్కార్.. అయితే, అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.. ఇవాళ సమావేశమైన టీడీపీ పొలిట్ బ్యూరో… అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదనే నిర్ణయానికి వచ్చింది.. అయితే, టీడీఎల్పీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.. పొలిట్‌బ్యూర్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పార్టీ నేత కాలువ శ్రీనివాసులు.. కౌరవ సభను తలపించేలా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించే అవకాశం లేకుండా.. మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు.. వైసీపీ ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగా మారారని మండిపడ్డారు. ఇక, ఏడాది పాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించినట్టు తెలిపారు. కాలువ శ్రీనివాసులు.. 40 ఏళ్ల ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను హైదరాబాద్‌లో.. మహానాడును విజయవాడలో జరపాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, హైకోర్టు తీర్పు జగన్‌కు చెంపపెట్టు అన్నారు కాలువ.. సీఎం జగన్ ఇప్పటికైనా మూడు రాజధానులకు స్వస్తి చెప్పాలని సూచించిన ఆయన.. రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది.. సంవత్సరానికి రూ. 12 వేల కోట్ల ఆదాయం కోల్పోయాం అన్నారు.. అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయాలని సలహా ఇచ్చారు. ఇక, వైఎస్ వివేకా హత్య కేసులో కట్టు కథలు అల్లుతున్నారని ఆరోపించారు శ్రీనివాసులు.. అసలు సూత్రధారులను త్వరగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 35 సంక్షేమ పథకాలను రద్దు చేసి.. పేదలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం లేదన్నారు.. రాష్ట్రంలో రూ. 12 వేల కోట్ల పథకాలు ఆగిపోయాయని విమర్శించారు.