YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

3 రాజధానులపై ముందస్తు...

3 రాజధానులపై ముందస్తు...

విజయవాడ, మార్చి 4,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మూడు రాజధానుల ముచ్చటకు రాష్ట్ర హై కోర్టు ముకుతాడు బిగించింది. ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి లేకున్నా, అమరావతే ఏపె రాజధాని అని తేల్చి చెప్పింది. అమరావతి ఒక్కటే ఏపె రాజధానని న్యాయస్థానం స్పష్టమైన తీర్పును ఇచ్చింది. అయినా మంత్రి  బొత్స సత్యనారాయణ తమ ప్రభుత్వ విధానం మూడు రాజధానులేనని మరోమారు స్పష్టం చేశారు. నిజానికి, మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుందే, మరింత పటిష్ట చట్టం చేసేందుకే అని గతంలోనే ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు కోర్టు తీర్పు నేపధ్యంలో చట్టం చేయడం, అయ్యే పనికాదని, ఒక వేళ కాదని సర్కార్ ముందుకు వెళ్ళినా, ప్రభుత్వం నిర్ణయం  న్యాయస్థానం ముందు నిలిచే అవకాశం  న్యాయనిపుణులు అంటున్నారు.  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లి, మూడు రాజదానులకు అనుకూలంగా తీర్పు కోరతారా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. నిజానికి, ముఖ్యమంత్రి మూడు రాజధానుల పంతాన్ని నెగ్గించు కోవాలంటే, ఆయన ముందున్న ఒకే ఒక్క మార్గం మళ్లీ ప్రజా తీర్పు కోరడమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ రెడ్డి అమరావతిని రాజధానిగా అంగీకరించారు. అసెంబ్లీలో అమరావతికి జై కొట్టారు. రాజధాని తీర్మానానికి మద్దతు తెలిపారు. ఎన్నికల ప్రచారంలోనూ అమరావతే రాజధాని అన్నారు. రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజలకు ఆ మేరకు స్పష్టమైన హామీ ఇచ్చారు. అప్పట్లో తెలుగు దేశం పార్టీ, వైసీపీ స్టాండ్ పై అనుమానాలు వ్యక్తచేసినా, జగన్మోహన్ రెడ్డి సహా ప్రతి నాయలు అందరూ, అమరావతే రాజధానిగా కొనసాగుతుందని ఒకటికి పదిసార్లు పజలకు హమీ ఇచ్చారు. తెలుగు దేశం అసత్య ఆరోపణలు చేస్తోందని ప్రతి విమర్శలు చేశారు. ఒక విధంగా చూస్తే ప్రజలను నమ్మించి ఓట్లు  దండుకున్నారు. అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన ఆలోచనలలో మార్పు వచ్చింది. కొత్త ఆలోచనలకు అనుకూలంగా, తమ నిర్ణయానికి అనుకూలంగా, ‘మమ’ అనిపించేదుకు    బోస్టన్ కమిటీ వేశారు. బోత్స కమిటీని తెరమీదకు తెచ్చారు. ప్రపంచంలో ఎక్కడో ఒకటి రెండు చోట్ల మూడు రాజధానులు ఉన్నాయని చెప్పు కొచ్చారు.  కానీ, ఈ రెండు మూడు దేశాలు మినహా మిగిలిన అన్ని దేశాలలో, మన దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఒకటే రాజధాని ఉందనే విషయాన్ని మాత్రం పక్కన పెట్టారు. ఇది ప్రజల్ని వంచించడమేనన్న విమర్శలు వచ్చాయి. రైతుల్ని మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. అయినా పట్టించుకోలేదు. ముందుకెళ్లారు. న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బలు తగిలాయి. ఇప్పుడు ఎటూ మూడు రాజధానులపై ముందుకెళ్లలేని పరిస్థితి ఉంది. కాబట్టి  మూడు రాజధానుల ఎజెండాగా ఎన్నికలకు వెళ్లడం ఒక్కటే, ముఖ్యమంత్రి ముందున్న మార్గం అంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి ఆ సాహసం చేస్తారా ? నిండా రెండేళ్ళ అధికారాన్ని వదులుకుని, ఎన్నికల బరిలో దిగుతారా, అనేది అనుమానమే అంటున్నారు. నిజానికి తెలుగు దేశం,ఇతర  ప్రతిపక్షాలు ఎప్పటి  నుంచో  మూడు రాజదానుల పై ప్రజాభిప్రాయం తీసుకోవాలని సవాల్ చేస్తున్నాయి. అయినా,  ప్రభుత్వం స్పందించలేదు. అయితే ఇప్పుడు గత కొంత కాలంగా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన చేస్తున్నారని వార్తలు వస్తున్న నేపధ్యంలో, దీన్ని అవకాశంగా తీసుకుని ఆ దిశగా అడుగులు వేస్తారా, అనే చర్చ రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. అయితే, ముందస్తు ఎన్నికల గురించి ఎవరెంత మాట్లాడినా, అటు అధికార వైసీపీ గానీ,  ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ కానీ, అలాగే, జనసేన సహా ఇతర  పార్టీలు ఏవీ కూడా ముందస్తు ఎన్నికలకు సిద్దంగా లేవు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. సో.. ముందస్తు వచ్చే ఛాన్స్’ అంతగా లేదని రాజకీయ విశ్లేషకులు

Related Posts