YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కడపకు రానున్న సీబీఐ బాస్

కడపకు రానున్న సీబీఐ బాస్

కడప, మార్చి 4,
వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడును మరింత పెచ్చింది. ఆ క్రమంలో ఢిల్లీ నుంచి సీబీఐ ఉన్నతాధికారులు గురువారం నేరుగా కడపకు వస్తున్నట్లు సమాచారం. ఆ క్రమంలో కడప ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డితోపాటు ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డికి సైతం వీరు నోటిసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు..ఇప్పటికే వీరిద్దరికీ సీబీఐ నోటీసులు జారీ చేసిదంటూ ఓ వార్త అయితే జిల్లావ్యాప్తంగా జోరుగా వైరల్ అవుతోంది. అంతేకాకుండా వీరిని సీబీఐ ఉన్నతాధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉందని సమాచారం.వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా నిందితులు ఇచ్చిన ప్రతి వాంగ్మూలంలో వైయస్ అవినాశ్ రెడ్డి పేరు ఉందన్న  సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అయన్ని ఒకటి లేదా రెండు రోజుల్లో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుంటారని సమాచారం. ఓ వేళ ఆయన్ని అదుపులోకి తీసుకుంటే జిల్లాలో ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఇప్పటికే జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో సీబీఐ ఉన్నతాధికారులు చర్చించినట్లు కూడా తెలుస్తోంది.   ఈ ఫిబ్రవరిలో సీబీఐ డీఐజీ చౌరసియా ఢిల్లీ నుంచి కడప వ‌చ్చారు. ఆయన జిల్లా సెంట్రల్ జైల్‌లోని అతిథి గృహంలోనే దాదాపు వారం రోజుల మకాం వేసి.. మరీ వివేకా హత్య కేసులోని అన్నీ పరిణామాలను ఆయన ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది.అయితే అప్పడే ఈ కేసులో కీలక నిందితులకు భేడీలు పడతాయనే ప్రచారం కూడా గట్టగానే నడిచింది. కానీ అది చివరి నిమిషంలో ఆగిందని సమాచారం. అయితే ఫ్యాన్ పార్టీకి చెందిన కీలక నేత.. ఢిల్లీ నుంచి పెద్ద ఎత్తున లాబీయింగ్ జరపడం వల్ల .. ఈ అరెస్ట్ ఆగినట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనా.. ఈ వివేకా హత్య కేసులో నిందితులు ఎవరంటే.. అందరి వేళ్లు.. వైయస్ అవినాశ్ రెడ్డి వైపు చూపిస్తున్నాయన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. వివేకా హత్య కేసులోని నిందితులు ఇప్పటికే కడప సెంట్రల్ జైలులో ఉన్నారన్న విషయం విధితమే.   2019, మార్చి 15వ తేదీన పులివెందులలో వైయస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. తొలుత ఆయనది గుండె పోటు అంటు ప్రచారం జరిగింది. కానీ ఆయనను అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఈ విషయంలో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైయస్ జగన్ ప్రభుత్వం వ్యవహారించిన తీరు అందరికీ తెలిసిందే. ఆ క్రమంలో వైయస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె వైయస్ సునీత ఏపీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో ఈ కేసును సీబీఐకు అప్పగిస్తూ  ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.ఈ కేసు దర్యాప్తు కొంత కాలం నత్తనడకలా సాగినా.. ఆ తర్వాత.. సీబీఐ తనదైన శైలిలో దూకుడు పెంచింది. అదీకాక.. వివేకా మాజీ కార్ డ్రైవర్ అప్రూవర్‌గా మారి.. ఈ కేసులోని అన్ని విషయాలు సుపారీతో సహా సీబీఐ ముందు పూసగుచ్చినట్లు వివరించారు. దీంతో ఈ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ పని కాస్తా సులువు అయిందనే టాక్ కూడా బాగానే నడిచింది. అయితే ఆ తర్వాత వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ పైనే కాకుండా ఆ సంస్థ ఉన్నతాధికారులపైన.. వివేకా కుమార్తె, అల్లుడిపైన కూడా కేసులు పెట్టేందుకు ఓ విధమైన తెరచాటు కుట్రకు నిందితులు శ్రీకారం చుట్టారు. దాంతో వివేకా హత్య కేసులో ఏం జరుగుతోందనేది ప్రజలకు అర్థం కాని పజిల్‌గా మరిపోయింది. ఆ క్రమంలో సీబీఐ సైతం సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత సీబీఐ.. ఈ కేసును ఛేదించేందుకు తనదైన శైలిలో ముందుకు దూసుకుపోయింది... పోతోంది.  మరికొద్ది రోజుల్లో ఈ హత్య కేసు వెనుక ఉన్న అసలు సూత్రదారులు, పాత్రదారులను ప్రజలు ముందు నిలబెట్టేందుకు సీబీఐ శక్తి మేర పనిచేస్తోంది.

Related Posts