హైదరాబాద్, మార్చి 4,
చైనా సరిహద్దులోని గాల్వాన్ వ్యాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత అమర జవాన్లను ఆదుకునేందుకు, గతంలో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.. అందులో భాగంగా జార్ఖండ్ పర్యటన చేపట్టనున్నారు కేసీఆర్.. శుక్రవారం ఢిల్లీ నుంచి రాంచీ వెళ్లినున్న ఆయన.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్‌తో భేటీకానున్నారు.. ఇక, వారి అధికారిక నివాసంలో రూ.10 లక్షల చెక్కులను జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు అందజేయనున్నారు.కాగా, చైనాతో జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీర మరణం చెందిన నేపథ్యంలో వారి కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆడుకున్న సంగతి తెలిసిందే. అదే సందర్భంలో అమరులైన 19 మంది అమర జవాన్ల కుటుంబాలను కూడా ఆర్థికంగా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. ఇచ్చిన మాట ప్రకారం.. ఢిల్లీ నుంచి శుక్రవారం సీఎం కేసిఆర్ జార్ఖండ్‌కు వెళ్లి ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలను ఆర్థిక సాయం అందించనున్నారు. కాగా, ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున, ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ప్రకటించిన ప్రకారం.. మిగిలిన అమర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ చర్యలు చేపడుతున్నారు.