YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఘనంగా హేమావతి బ్రహ్మోత్సవాలు

ఘనంగా హేమావతి బ్రహ్మోత్సవాలు

అనంతపురం
అనంతపురం జిల్లా మడకశిర తాలూకా హేమావతి లో మహా శివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకొని బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంబమయ్యాయి. శైవక్షేత్రాల్లో ఎక్కడచూసిన శివుడు లింగాకారంలో దర్శనమిస్తాడు అయితే ఇక్కడ దేశంలో ఎక్కడా లేని విధంగా శివుడు మానవ రూపంలో దర్శనమివ్వడం ఈ క్షేత్రం యొక్క విశేషం. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండలం హేమావతి గ్రామంలో వెలిసిన  శివాలయంలో స్వామివారిని  భక్తులు హేంజేరు సిద్దేశ్వర స్వామి గా  కొలుస్తున్న ఈఆలయం ఎంతో  ప్రసిద్ధి గాంచింది. అతి పురాతనమై ఈఆలయాన్ని నొలంబరాజుల కాలంలో  నిర్మించారని  ఆలయ చరిత్ర తెలుపుతోంది. ఇక్కడ ప్రతి ఏటా  మహా శివరాత్రి  పర్వదినాన్ని పురష్కరించుకొని  బ్రహ్మోత్సవాలు  ఐదు రోజుల పాటు  ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భక్తులు ఇతర రాష్ట్రాల నుండి అధికంగా పాల్గొంటారు, ఉత్సవాల్లో భాగంగా జరిగే అగ్నిగుండ మహోత్సవం  ఎంతో ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఎంతో మందిభక్తులు ఉపవాస దీక్షతో  అగ్నిగుండంలో దూపం వేస్తారు, మరికొంత మంది  భక్తులు వారు పండించిన పంటలో కొంత భాగం అగ్నిగుండంలో  వేసి మొక్కుబడులు తీర్చుకుంటారు,ఇలాచేస్తే పంటలు బాగా పండుతాయని వారి నమ్మకం, అగ్ని గుండం లో దూపం వేస్తే దీర్ఘకాలిక రోగాలు, చర్మవ్యాదులు నశిస్తాయని ,ఇంటిలో సుఖశాంతులు నెలకొంటాయని బక్తుల ప్రగాడమైన నమ్మకం.అగ్నిగుండంలో దూపంవేసి మొక్కులు తీర్చుకోవడానికి ఆంద్ర, కర్ణాటక, తెలంగాణ రాష్టాృల నుండి  భక్తాదులు భారీగ తరలి వచ్చారు.

Related Posts