రంగారెడ్డి
మహిళల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టికేఆర్ కాలేజ్ లో డ్రగ్స్ అవగాహన సదస్సు లొ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి,రంగారెడ్డి జిల్లా చైర్మన్ తీగల అనిత రెడ్డి, రాచకొండ సీపీ మహేష్ భగవత్,ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డ్రగ్స్ అలవాటు కు దూరంగా ఉండాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని తమ లక్ష్యం చేరేవరకు పట్టుదలతో చదువుకోవాలని మంత్రి అన్నారు.మహిళల పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించిన భయపడకుండా పోలీసులు ఆశ్రయించాలని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండి రాణించాలని తెలంగాణ వచ్చిన తర్వాత స్థానిక సంస్థల లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ పెంచడమే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం విప్లవాత్మక మార్పు అన్నారు.టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ మహిళలపై రకరకాల వేధింపులు పెరిగిపోయాయని మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం షీ టీమ్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు.డ్రగ్స్ హరిత తెలంగాణ కోసం ప్రభుత్వ కృషి చేస్తుందని అన్నారు.