విజయనగరం
విజయనగరంజిల్లా కురుపాం మండలంలో విషాదం చోటు చేసుకుంది. బీసీ హాస్టల్లోకి కట్లపాము చొరబడింది. అర్థరాత్రి నిద్రిస్తున్న ముగ్గురు విద్యార్థుల ముఖంపై కట్లపాము కాటేసింది. పాము కాటుతో విద్యార్థులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో తోటి విద్యార్థులు హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది పాముకాటుకు గురైన విద్యార్థులను 108 అంబులెన్స్ సహాయంతో విజయనగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పాముకాటు వల్ల విద్యార్థుల పరిస్థితి విషమించడంతో మిగతా విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. రంజిత్ అనే విద్యార్థి మృతి చెందాడు మిగతా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని చెప్పాలి సంఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ కుమారి చేరుకున్నారు స్థానిక రాజకీయ నాయకులు హాస్టల్ వసతి గృహాన్ని సందర్శించారు కనీస సదుపాయాలు లేకపోవడంతో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని అఖిలపక్ష నాయకులు మీడియాకు తెలియజేశారు