హైదరాబాద్ మార్చ్ 4
రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు మరో సంస్థ ముందుకువచ్చింది. వైద్య పరికరాలు తయారు చేసే ఎస్3వీ వ్యాస్క్కులార్ టెక్నాలజీస్ అనే సంస్థ రాష్ట్రంలో తమ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. దీనిద్వారా సుమారు 750 మందికి ఉపాధి లభించనుందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన వారికి అభినందనలు తెలిపారు. ‘రాష్ట్రంలో వినియోగించే వైద్య పరికరాల్లో దాదాపు 78 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. స్థానికంగా ఉత్పత్తులను పెంపొందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 250 ఎకరాల్లో మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో వైద్య పరికరాల తయారీ సంస్థ ఎస్3వీ వ్యాస్క్యులార్ టెక్నాలజీస్ రూ.250 కోట్ల పెట్టుబడితో… మెడికల్ డివైజెస్ పార్క్లో తమ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. దీనిద్వారా ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 250 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.