YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాం

అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాం

సంగారెడ్డి
మల్లన్న సాగర్ నిర్మాణం తెలంగాణ ప్రభుత్వంతో సాధ్యం కాదని విమర్శలు చేసిన నాయకులే ఈరోజు  కెనాల్ ద్వారా వస్తున్న ఆ నీటిని పూలు చల్లి హారతులతో స్వాగతం పలుకుతున్నారని.... ఇది తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు
సిద్దిపేట జిల్లా తోగుట మండల పరిధిలో నిర్మాణం చేసిన 50  టీఎంసీల మల్లన్నసాగర్ ప్రాజెక్టు పూర్తిచేసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఇటీవలే ప్రారంభం చేసుకున్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఈ నేపథ్యంలో  పంటలను సాగు చేసుకునేందుకు  నీరు అందించాలని రైతులు ప్రజలు కోరడంతో మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి లు  విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు... ఐతే ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించి ముందుగా మల్లన్న సాగర్ నుంచి దుబ్బాక సిద్దిపేట సిరిసిల్ల ప్రాంతాలకు  నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. దీంతో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, యాదవరెడ్డి లు  మండల కేంద్రంలోని ఎల్లారెడ్డిపేట గ్రామ సమీపంలోని కెనాల్ లోకి  మల్లన్న సాగర్ ద్వారా వస్తున్న నీటిని విడుదల చేశారు. అనంతరం ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి  మాట్లాడుతూ  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలలుకన్న కల సాకారం కావడంతో పాటు పలు జిల్లాలకు మల్లన్న సాగర్ ద్వారా నీటిని తరలించి వివిధ జిల్లాలోని రైతులకు సాగు, తాగునీరు అందించడానికి అవకాశం లభించిందని అన్నారు.. రైతుల శ్రేయస్సు కొరకు అహర్నిశలు కృషి చేసిన మహనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. మల్లన్న సాగర్ నిర్మాణంలో  మంత్రి హరీశ్ రావు కృషి మరువలేనిదన్నారు.  నీటిని విడుదల చేయడంతో  రైతులు, ప్రజలు,సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో  ఎమ్మెల్యే రఘునందన్ రావు , ఎమ్మెల్సీ లు  ఫారూఖ్ హుస్సేన్, యాదవరెడ్డి,  అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి, చిట్టి దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts