విశాఖపట్నం
రాష్ట్ర ప్రభుత్వం 11వ పిఆర్సి ద్వారా ఉద్యోగులను దగా చేసిందని , ప్రత్యేకించి మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు నామమాత్రపు జీతాలు పెంచి చేతులు దులుపుకోవడం జరిగిందని మున్సిపల్ కార్మికుల యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు అన్నారు. జీవీఎంసీ కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు పి ఆర్ సి ప్రకారం 20 వేల రూపాయలు జీతం చెల్లించాలని కోరుతూ జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మానవహారం జరిపారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ను సవరించి మెరుగైన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాలలో దీక్షలు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే అన్ని సంఘాలను కలుపుకొని ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.