విశాఖపట్నం
దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఇది తమిళనాడులోని నాగపట్నంకు ఆగ్నేయంగా 390 కిలోమీటర్ల దూరంలో కేంధ్రీకృతమైనట్లు విశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉత్తర వాయువ్యంగా ప్రయాణించి తమిళనాడు తీరానికి దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నాయని, దీని ప్రభావంతో దక్షిణ కొస్తా జిల్లాలైన నెల్లూరు చిత్తూరులో మొస్తారు వర్షాలు రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.వాయుగుండం దగ్గరగా వచ్చే సమయంలో తీర ప్రాంతంలో గాలుల ప్రభావం అధికంగా ఉంటుందని,రానున్న మూడు రోజుల పాటు మత్య్సకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.