YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆశల పల్లకిలో... ఊరేగుతూ

ఆశల పల్లకిలో... ఊరేగుతూ

విజయవాడ మార్చి 5,
చంద్రబాబు తనకు తాను ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. అధికారంలో లేనప్పుడల్లా ఆయన చేసేది అదే. ఆ ప్రపంచంలో తానే ముఖ్యమంత్రి. తన ఆదేశాలే అమలు కావాలని ఆకాంక్షిస్తారు. గతంలోనూ ఇలాగే ఉండేది. అయితే ఇప్పుడు అది మరింత ముదిరింది. తాను చెప్పిందే జరగాలంటాడు. తాను చేసిందే మంచి నిర్ణయాలు, జగన్ చేసినవన్నీ తప్పుడు నిర్ణయాలని ఆయన అభిప్రాయం. అంతేకాదు తన అభిప్రాయాన్ని బలవంతంగా నేతలపైన కూడా రుద్దుతుంటారు. జగన్ నిర్ణయాల్లో కొన్ని తప్పులు ఉండొచ్చు. అలాగని అన్నీ నిర్ణయాలను తప్పు పడితే ప్రతిపక్ష నేత అనిపించుకోరు. కానీ చంద్రబాబు మాత్రం జగన్ వేసే ప్రతి అడుగును వ్యతిరేకిస్తుంటారు. 2019 ఎన్నికల నాటికి జగన్ కు ఎటువంటి అధికారం లేదు. అందుకే చంద్రబాబు గత ఎన్నికల్లో పులివెందుల పంచాయతీ, రౌడీ రాజకీయం, లక్షల కోట్ల అక్రమాస్తులు అంటూ ప్రచారం చేసినా నమ్మ లేదు. ఇప్పుడు చంద్రబాబుకు జగన్ ను విమర్శించేందుకు పాయింట్లు అయితే దొరికాయి. వ్యతిరేకతే తనను.... అయితే చంద్రబాబు మాత్రం ఈసారి జగన్ పై ఉన్న వ్యతిరేకత తనను మళ్లీ సీఎం కుర్చీ మీద కూర్చోపెడుతుందన్న నమ్మకంతో ఉన్నారు. అందుకే ఆయన బిందాస్ గా ఉన్నట్లు కన్పిస్తుంది. ఈసారి పొత్తులతో వెళుతుండటం, జగన పై అసంతృప్తి తనకు ఖచ్చితంగా విజయం తెచ్చి పెడుతుందన్న విశ్వాసం చంద్రబాబులో పదే పదే కన్పిస్తుంది. అందుకే ఆయన సమీక్షలకే పరిమితమవుతున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను తెలుసుకోకుండానే ఆయన మితిమీరిన విశ్వాసంతో ఉన్నట్లు అనిపిస్తుంది.  పొరుగు రాష్ట్రాల్లో.... కానీ పొరుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలను ఆయన గుర్తులేదోమో. తెలంగాణలో కేసీఆర్ ను రెండుసార్లు అక్కడ ప్రధాన ప్రతిపక్షం ఓడించలేకపోయింది. తమిళనాడులోనూ డీఎంకే రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్నికల్లో పోరాడాల్సి వచ్చింది. మూడో సారి కాని స్టాలిన్ కు ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. ఒడిశాలో అయితే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు తిరుగులేకుండా పోయింది. అందుకే జనంలో వ్యతిరేకత ఉందని, అదే తనకు లాభిస్తుందని కార్యాలయంలో కూర్చుని తన ప్రపంచంలో విహరిస్తుంటే మాత్రం చంద్రబాబుకు మరోసారి భంగపాటు తప్పదు. ఇప్పటికైనా జనంలోకి వెళ్లి ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ నేతలు సయితం కోరుకుంటున్నారు.

Related Posts