ఏపీలో స్థిరపడాలని అనేక వ్యూహాలు సిద్ధం చేస్తున్న బీజేపీకి.. వచ్చే ఎన్నికలు అత్యంత కీలకం కానున్నాయి.ఏపీలో కుల రాజకీయాలకు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ అభ్యర్థుల గెలుపు ఓటముల్లో కుల ప్రాబల్యమే కీలకంగా ఉంటుంది. ఇప్పటికే ఇక్కడ అధికార టీడీపీపై కమ్మ ముద్ర ఉంది. విపక్ష వైసీపీకి రెడ్ల పార్టీగా ముద్ర ఉంది. మరి కుల పరంగా చూస్తే కమ్మ, రెడ్డి కులాల కంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్న కాపులు ఎప్పటి నుంచో అధికారం కోసం కలలు కంటున్నారు. ముఖ్యంగా ప్రధాని మోడీ ఏపీకి చేసింది ఏమీలేదని ఒక పక్క ఏపీ సీఎం చంద్రబాబు, ఎన్డీయే మాజీ మిత్రుడు చేస్తున్న ప్రచారం నేపథ్యంలో ఇక్కడ బీజేపీ తన హవాను ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలోనే ఇక్కడి రాజకీయ పరిస్థితులపై గడిచిన ఆరు మాసాలుగా బీజేపీ అధిష్టానం అధ్యయనం చేస్తోంది. అంతేకాదు, కేంద్రం నుంచి తన పరిశీలకులను పంపి.. ఇక్కడి పరిస్థితులను సైతం అధ్యయనం చేయిస్తోంది. దీంతో ఇక్కడి బీజేపీ పరిస్థితులు వడివడిగా మారిపోతున్నాయి. ఇక్కడ రాజకీయాలను కీలకంగా శాసించగల నాయకులకు బీజేపీ ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఈ వర్గంలో ఎక్కువ మంది ఆ పార్టీ వైపు వెళ్లడంతో పాటు తాము తొలిసారిగా అధికారంలోకి రాబోతున్నామని కలలు కన్నారు. అయితే ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం ఘోరంగా ఫెయిల్ అయ్యింది.ఇక వచ్చే ఎన్నికల్లో చిరు సోదరుడు పవన్‌కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి పోటీకి రెడీ అవుతున్నా పవన్ పార్టీని కాపుల్లో ఎంతమంది నమ్ముతున్నారని ప్రశ్నించుకుంటే ఆన్సర్ దొరకదు. పవన్‌పై నమ్మకం లేక చాలా మంది కాపులే ప్రత్యామ్నాయం కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. ఇక ఏపీలో బీజేపీ ప్రస్తుతం చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో రాజకీయంగా కొన్ని ఎత్తుగడలు అయినా వేయాలన్నదే ఆ పార్టీ ప్లాన్‌గా స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే ఏపీలో బలంగా ఉన్న కాపులను అయినా కొంత వరకు ఆకట్టుకునే క్రమంలోనే ఆ వర్గానికి చెందిన కన్నాకు ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించినట్టు తెలుస్తోందివిశాఖ బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబును త్వరలోనే కేంద్రంలోని కీలక పదవుల్లోకి తీసుకుంటారనే ప్రచారం జరుగు తోంది. అదేసమయంలో ఏపీలోని మరో కీలక సామాజిక వర్గం.. కాపులను కూడా బీజేపీ ప్రాధాన్య జాబితాలోకి తీసుకుంది. కాపులను ఆకట్టుకునే క్రమంలోనే బీజేపీ అడుగులు వేసింది. ప్రధానంగా కాపు సామాజిక వర్గం ఇప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా పావులు కదుపుతోంది. తమకు రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించి కూడా ఆయన అన్యాయం చేశారని కాపులు ఫీలవుతున్నారు. అంతేకాదు, ఎన్నికల కోసం తాము వెయిట్ చేస్తున్నామని, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటిస్తున్నారు. ఇక, కాపులకు న్యాయం చేసే పార్టీకి, కాపులకు పెద్దపీట వేసే పార్టీకిమాత్రమే వచ్చే ఎన్నికల్లో కాపులు అండగా ఉంటారని ముద్రగడ ఇప్పటికే ప్రకటించారు.పవన్ కళ్యాణ్ జనసేన కూడా కాపులను టార్గెట్ చేసేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ప్రధానంగా పవన్.. కాపు వర్గానికి చెందన నేత కావడంతో బీజేపీ వచ్చే ఎన్నికల్లో తన సత్తా చాటాలంటే.. కాపు సామాజిక వర్గాన్ని ప్రాధాన్యం లోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సహా అత్యంత కీలకమైన రాష్ట్ర బీజేపీ ఎన్నికల కన్వీనర్‌గా కాపు సామాజిక వర్గానికి చెందిన, ప్రజల్లో మంచి దమ్మున్న నాయకులను నియమించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ, ఎన్నికల కన్వీనర్‌గా సోమును నియమించడం ద్వారా కాపులకు బీజేపీ వేసిన వల టార్గెట్ తప్పలేదని అంటున్నారు పరిశీలకులు.అయితే ఈ స్ట్రాటజీ చాలా ధైర్యంతో చేసిందే అయినా ఎంత వరకు వర్కవుట్ అవుతుందో ? చెప్పలేని పరిస్థితి.