YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

విజయవంతంగా ముగసిన మిలాన్

విజయవంతంగా ముగసిన మిలాన్

విశాఖపట్నం
మిలాన్ - 2022 ముగిసిం ది.ఎనిమిది రోజల పాటు ప్రజలను అలరించిన నేవి విశాఖ ప్రజలకు స్వీట్ మెమోరీస్ అందించింది.విశాఖ తీరం మిలాన్-2022 నౌకాదళ విన్యాసాలతో నేవీ సిబ్బంది హోరెత్తించారు. సాయం త్రం సూర్యాస్తమయం వేళలో ఆర్కె.బీ చ్ కు చేరుకున్న ప్రజలు నేవీ ప్రదర్శన లకు మంత్రముగ్దలైయ్యారు.లక్షల మంది వీక్షకుల ఆనందోత్సాహాలు, కేరింతల మధ్య సముద్ర జలాలపై నౌకలు, గగనతలంలో యుద్ధవిమా నాలు, మెరైన్ కమాండోలు అబ్బుర పరిచే విన్యాసాలు ఇలా ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఆపరేషనల్ డెమా న్స్ట్రేషన్లో భాగంగా సముద్రం మధ్య లో యుద్ధనౌకల్లోని నావికులను సురక్షి తంగా తీసుకెళ్లే సన్నివేశాలు ఆహ్లాద పరిచాయి. అతివేగంగా దూసుకొచ్చే యుద్ధవిమానాలు గగనతలాన్ని ముద్దాడి అంతర్థాన మయ్యే విన్యా సాలు ఆకట్టుకున్నాయి.26 నౌకలు, ఒక జలాంతర్గామి 21 విమానాలు 11 వ మిలాన్ లో పాల్గొని దేశ ప్రజలను ఆకట్టుకున్నాయి.మిలాన్ ముగింపు వేడుకలు INS జలశ్వలో నిర్వహిం చారు.ఆరు విదేశీ నౌకలు వర్చువల్ మోడ్లో ముగింపు వేడుకకు హాజర య్యాయి.ఈ వేడుకల్లో కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్ ఎన్ఎం ఆర్ఎడిఎమ్ సంజయ్ భల్లా పాల్గొన్నారు.

Related Posts