నెల్లూరు
అమరావతి విషయంలో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజధాని అమరావతి విషయంలో న్యాయం గెలిచిందని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇగోలను పక్కన పెట్టి వాస్తవంలోకి రావాలని.రాష్ట్ర భవిష్యత్ కోసం పనిచేయాలని హిత వు పలికారు.2 వేల కోట్లు ఖర్చుపెడితే రాజధాని అందుబాటులోకి వస్తుంద ని.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచిం చారు.చట్టాలు ఎలాగున్నా తాము మొదటి నుంచి ఒకే నమ్మకంతో ఉన్నామని.. అంతిమ విజయం న్యాయాని దేనని మాజీ మంత్రి అన్నా రు.రాజధాని అమరావతిని కాపాడు కోవడం కోసం రైతులు 807 రోజుల పాటు పోరాటం చేయడం ఒక చరిత్ర అని కొనియాడారు. ఎన్నో ఆటంకాలు, అవాంతరాలు, అవమానాలను ఎదు ర్కొని అమరావతి ఆడపడుచులు చేసిన పాద యాత్ర కష్టం వృథా పోలేద న్నారు.ఇకనైనా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇగోలకు పోకుండా రాష్ట్ర భవిష్య త్ కోసం పనిచేయాలని కోరారు. రాష్ట్ర రాజధాని ఎక్క డంటే చెప్పుకోలేని పరి స్థితిలో నిన్నటి వరకు ఆంధ్రులు ఉన్నారని సోమిరెడ్డి అన్నారు.