YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం విదేశీయం

మ‌హిళ‌ల వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య వ‌న్డే మ్యాచ్

మ‌హిళ‌ల వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య వ‌న్డే మ్యాచ్

న్యూ ఢిల్లీ మార్చ్ 5
మ‌హిళ‌ల వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో రేపు ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య వ‌న్డే మ్యాచ్ జ‌ర‌గ‌నున్న‌ది. న్యూజిలాండ్‌లో జ‌రుగుతున్న ఈ టోర్నీలో మౌంట్ మౌంగ‌నూయి ఈ మ్యాచ్‌కు వేదిక కానున్న‌ది. నిజానికి ఇండియా, పాక్ మ్యాచ్ అంటే ఆస‌క్తి ఎక్కువ‌గా ఉంటుంది. కానీ మ‌హిళ‌ల మ్యాచ్ కావ‌డంతో పెద్ద‌గా ఇంట్రెస్ట్ లేదు. అయినా మ‌హిళ‌ల క్రికెట్‌లో ఇండియాకు మంచి రికార్డు ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు పాకిస్థాన్‌పై 10 వ‌న్డేల్లో ఇండియ‌న్ వుమెన్స్ జ‌ట్టు గెలిచింది. ఇక 11 సార్లు జ‌రిగిన టీ20 మ్యాచుల్లోనూ ఒకేసారి ఇండియా ఓడిపోయింది. స్మృతి మందాన ఈ మ్యాచ్‌కు రెఢీగా ఉంది. వ‌ర‌ల్డ్‌క‌ప్ వార్మ‌ప్ మ్యాచుల్లో ద‌క్షిణాఫ్రికా, విండీస్‌తో జ‌రిగిన మ్యాచుల్లో ఇండియా నెగ్గింది. పాకిస్థాన్‌తో రేపు జ‌రిగే మ్యాచ్‌లో ఇండియాదే పైచేయి. పాకిస్థాన్ కెప్టెన్ బిస్మా మ‌హ‌రూఫ్ ఇటీవ‌లే మెట‌ర్న‌టీ లీవ్ నుంచి వ‌చ్చేసింది. ఆర్నెళ్ల కూతురు ఉన్న ఆమె ఇండియాతో మ్యాచ్‌లో ఆడ‌నున్న‌ది.

Related Posts