YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గౌతమ్ రెడ్డి పేరు పెడతారా..?

గౌతమ్ రెడ్డి పేరు పెడతారా..?

నెల్లూరు, మార్చి 7,
మేకపాటి మెరిట్స్ కళాశాల స్థలం అగ్రికల్చర్ యూనివర్శిటీకి ఇస్తా.. నా కుమారుడు గౌతమ్ రెడ్డి పేరు పెట్టండి’ అంటూ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తండ్రి, మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి ఇటీవల ప్రభుత్వానికి సందేశం పంపారు. అయితే.. ఆయన మొరను సీఎం జగన్ రెడ్డి ఇంతవరకూ పట్టించుకున్న పాపాన పోలేదు. 245 కోట్ల రూపాయల విలువైన సుమారు 110 ఎకరాల భూమిని, అందులోని భారీ కట్టడాలతో సహా ప్రభుత్వానికి ఇస్తానని, తన కుమారుడి పేరు పెట్టాలని మీడియా ముందుకొచ్చి మరీ రాజమోహన్ రెడ్డి చెప్పారు. ఆయన అలా చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటో అంతు చిక్కడం లేదంటున్నారు. దీని వెనుక ఏదో రహస్యం లేకపోలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దానమిస్తా మొర్రో అన్నా.. జగన్ దానిని పెడచెవిన పెట్టడంలోని ఆంతర్యం ఏమిటో అని ఏపీ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.మేకపాటి రాజమోహన్ రెడ్డి చాలా కాలంగా సైలంట్ గా ఉన్నారు. కొడుకు గౌతమ్ ఆకస్మిక మృతితో ఆయన కాస్త యాక్టివ్ అయ్యారు. తాను స్వయంగా కష్టపడి సంపాదించిన సొమ్ముతో మెట్టప్రాంతం ఉదయగిరిలో వంద ఎకరాల విస్తీర్ణంలో మేకపాటి మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేశారు. రాజకీయ కార్యకలాపాల కూడా ఏళ్ల తరబడి అక్కడి నుంచి ఆయన కొనసాగించారు. అయితే.. తన పేరు మీద ఉన్న కళాశాలకు తన కుమారుడు గౌతమ్ రెడ్డి పేరు పెట్టడం చాలా ఈజీ.. అలా చేయకుండా అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఇస్తాను గౌతమ్ రెడ్డి పేరు పెడితే అనడం వెనక ఏదో పెద్ద రహస్యమే దాగుందనే  ప్రచారం స్థానికంగా జరుగుతోంది.ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఈ యూనివర్శిటీ పేరు తెర మీదకు రావడానికి కారణం లేకపోలేదంటున్నారు. గౌతమ్ రెడ్డి జీవించి ఉన్నప్పుడు ఉదయగిరిలో ప్రభుత్వం అగ్రికల్చర్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తే 120 కోట్లకు ఈ భూమిని ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నారట. దానికి సంబంధించి సెక్రటేరియట్ లో ఫైల్ కూడా మూవ్ అయిందట. గౌతమ్ బ్రతికి ఉంటే అది పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చేదనే ప్రచారం జరుగుతోంది. గౌతమ్ రెడ్డి ఉన్నప్పుడే ఫైల్ పై సంతకాలు కూడా చేశారని, అందుకు సంబంధించిన నిధులు మాత్రం ఇంకా రాలేదని రాజమోహన్ రెడ్డి దృష్టికి వచ్చిందట. దాంతో ముందుగానే ఒక మాట వేసి పెడితే అసలు సంగతి బయటకు వస్తుందని రాజమోహన్ రెడ్డి ఇలా భూమి, భవనాలు ఇస్తానన్నారని అనుకుంటున్నారు.కానీ.. ఇంత జరుగుతున్నా జగన్ నుండి ఆ ఊసే లేకపోవడంతో మరిన్ని అనుమానాలకు తావిస్తోందంటున్నారు. దాంతోపాటు రాజమోహన్ రెడ్డికి జగన్ ఎలాంటి ప్రాధాన్యమూ ఇవ్వడం లేదని అంటున్నారు. దీంతో గౌతమ్ రెడ్డి ఉన్నప్పుడు ఫైల్ పై సంతకం చేసింది నిజమైతే.. డబ్బులు రాకపోయినా కనీసం కొడుకు పేరైనా నిలబడుతుందనేది రాజమోహన్ రెడ్డిలో చిన్న ఆశ అట. చూడాలి మరి ఏం జరుగుతుందో!

Related Posts