YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సూర్య నమస్కారం చేస్తున్న శ్వేతనాగు

 సూర్య నమస్కారం చేస్తున్న శ్వేతనాగు

 - భద్రాచలం అడవుల్లో అద్భుతమైన దృశ్యం

- సూర్యున్ని ఆరాధిస్తూ కనిపించిన శ్వేతనాగు

ఏజెన్సీలోని అటవీ ప్రాంతంలో అద్భుతమైన దృశ్యం సాక్షాత్కరించింది. ఓ శ్వేతనాగు సూర్య నమస్కారం చేస్తుండగా అటవీ సిబ్బంది దానిని తమ సెల్‌ఫోన్లలో భంధించారు. భద్రాచలం ఏజెన్సీలో ప్రస్తుతం పులుల సంఖ్య లెక్కించే కార్యక్రమంలో భాగంగా అటవీ సిబ్బంది బుధవారం తెల్లవారుజామున సమీపంలోని అడవిలోకి వెళ్ళారు.

అయితే... పొద్దున్నే సూర్యోదయం సమయంలో ఓ శ్వేతనాగు పడగవిప్పి సూర్య నమస్కారం చేయడాన్ని సిబ్బంది గమనించారు. వెంటనే ఆ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. సాధారణంగా శ్వేతనాగులు చిన్న అలికిడి విన్నా వెంటనే అక్కడినుంచి వెళ్లిపోతాయి.

అయితే... అటవీ సిబ్బంది అలికిడి విన్నప్పటికీ ఆ శ్వేతనాగు అలాగే కదలకుండా అలాగే కొద్దిసేపు పడగవిప్పి సూర్యుడి వైపు చూసిన అనంతరం పక్కనే ఉన్న పొదల్లోకి పోయిందని సిబ్బంది తెలిపారు. ఇదిలా ఉండగా బుధవారం రథసప్తమి. ముందు రోజున ఈ దృశ్యం కనిపించడాన్ని విశేషంగా భావిస్తున్నారు.

Related Posts