YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మిషన్ 2024 కు కేసీఆర్ కార్యాచరణ

మిషన్ 2024 కు కేసీఆర్ కార్యాచరణ

హైద్రాబాద్, మార్చి 7,
ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం ఒక్కటే కనిపిస్తోంది.. మిషన్‌-2024..! ఒకే దెబ్బకు రెండు పిట్టలు.! ఇదే  కేసీఆర్‌ ప్లాన్‌. ప్లానింగ్..! ఢిల్లీ కోటను ఢీ కొట్టాలి.! అదే టైమ్‌లో రాష్ట్రంలోనూ తిరుగులేని శక్తిగా ఎదగాలి.! ఈ దిశగానే కార్యాచరణ సిద్ధం అవుతోంది..! అందుకే రాజకీయ వ్యూహకర్త, ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌ ప్రశాంత్ కిశోర్ అండ్ టీమ్‌ను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. మరి బీజేపీ, కాంగ్రెస్సేతర పక్షాలను ఏకతాటిపైకి తేవడం కోసం వ్యూహాన్ని అమల్లో పెట్టబోతున్నారు. తెలంగాణ గట్టు మీదుగా.. ఢిల్లీకి రూట్ క్లియర్ అయ్యేట్లు వ్యుహ ప్రతివ్యుహాల్లో నిమగ్నమయ్యారు. దేశం కోసం చివరిరక్తపుబొట్టు వరకు పోరాడుతా..! జాతీయ రాజకీయాల్ని కచ్చితంగా ప్రభావితం చేస్తానని ఈ మధ్య ప్రకటించారు  కేసీఆర్. తన స్పీచ్‌ల్లోనూ జాతీయ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కుల, మత విధ్వంసాలు, కర్ణాటక హిజాబ్ ఇష్యూ, రఫేల్‌ స్కామ్, కేంద్ర మంత్రుల అవినీతి చిట్టా, కరోనా టైమ్‌లో మోడీ వైఫల్యం, బ్యాంకుల స్కామ్‌లు, సర్జికల్ స్ట్రైక్‌ పై ఆధారాలు అడగడం ఇలా అన్ని అంశాలను టచ్ చేశారు. నేషనల్‌ లెవల్లో ఓ చర్చను లేవదీశారు. ఇలా ఈ మధ్య కాలంలో కేసీఆర్ మాట్లాడిన హాట్ కామెంట్స్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేయడంలో పీకే అండ్‌ టీమ్‌ ఉందట.ప్రశాంత్‌ కిషోర్‌కు 20 రాష్ట్రాల్లో పర్మనెంట్‌ సెటప్‌ ఉంది. అన్ని చోట్ల ఐ ప్యాక్‌ టీమ్ పనిచేస్తోంది. ఈ టీమ్‌ కేసీఆర్ కామెంట్స్‌ను ఆయా రాష్ట్రాల్లోని భాషల్లోకి ట్రాన్స్‌లేట్‌ చేసి…. సోషల్‌ మీడియాలో విపరీతంగా సర్క్యూలేట్‌ అయ్యేలా చేసిందట. కేసీఆర్ మాటలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు.. అక్కడి నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్‌ను సేకరించిందట. ముఖ్యంగా బీజేపీ, మోడీని టార్గెట్ చేస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారన్నది విశ్లేషిస్తున్నట్లు టాక్. అంతేకాదు ఆయా రాష్ట్రాల్లో లోకల్‌గా ఉన్న సమస్యలు, ఇష్యూస్‌పైనా ఫోకస్ చేస్తోందట పీకే టీమ్. జనం నుంచి వచ్చిన రియాక్షన్స్‌, లోకల్‌గా ఉన్న ఇష్యూస్‌ బేస్‌డ్‌గా ప్లానింగ్‌ రూపొందించాలన్నది పీకే అండ్ కేసీఆర్ టీమ్‌ వ్యూహాంగా కనిపిస్తోంది.రాజకీయ వ్యూహకర్త, ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌గా ప్రశాంత్ కిషోర్‌కు మంచి పేరుంది. గతంలో బీజేపీతో కూడా కలిసి పనిచేశారు. ఈ మధ్య కాంగ్రెస్‌లోనూ చక్రం తిప్పాలనుకున్నారు బట్ వర్కౌట్ కాలేదు. 2015లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, 2017లో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమహేందర్ సింగ్ , 2019లో ఏపీ సీఎం  జగన్‌ మోహన్ రెడ్డి, 2021లో తమిళనాడు సీఎం ఎంకే.స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలకోసం పనిచేశారు. సక్సెస్ అయ్యారు. అందరూ అధికారం చేపట్టేలా వ్యూహాలు రచించి విజయం సాధించారు. అయితే పీకే ఇప్పటి వరకు చేసింది వేరు.. తెలంగాణ గడ్డ నుంచి చేయబోది వేరు అన్న టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఆయా పార్టీలు, వ్యక్తుల కోసం పనిచేశారు ప్రశాంత్. బట్ ఫస్ట్‌ టైమ్‌ ఓ కూటమి కోసం.. కాస్త గట్టిగానే ఫోకస్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. లోకల్‌గా గులాబీ పార్టీకోసం వ్యూహాలు రూపొందిస్తూనే థర్డ్‌ ఫ్రంట్ ఏర్పాటు దిశగానూ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ ఎపిసోడ్‌లో ప్రకాష్‌రాజ్‌ ఎంట్రీ కూడా ఆసక్తికరంగానే ఉంది. గతంలో టీఆర్ ఎస్ తోగానీ, పార్టీలీడర్లతోగానీ ప్రకాష్‌రాజ్‌ పెద్దగా కనిపించింది లేదు.. కానీ సడెన్‌గా మొన్న మహారాష్ట్ర టూర్‌లో ప్రత్యక్షం అయ్యారు. కేసీఆర్‌ టూర్‌ మొత్తం ఆయన వెంటే ఉన్నారు. కొంతకాలంగా బీజేపీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనగళం వినిపిస్తున్నారు ప్రకాష్‌రాజ్‌. జస్ట్ ఆస్కింగ్ పేరుతో సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. అంతే కాదు.. దక్షిణాది రాష్ట్రాలో పలు పార్టీల నేతలు, సీఎంలతో పరిచయాలు ఉన్నాయి. సో సౌత్‌లో బీజేపీ కాంగ్రెస్సేతర పార్టీలను కలవడం, వారిని ఏకతాటిపైకి తేవడంలో ప్రకాష్‌రాజ్‌ సేవలు ఉపయోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.వాస్తవానికి పీకే అండ్‌ టీమ్ ఇప్పటికే తెలంగాణలో ప్రాథమిక సర్వే కూడా చేసినట్లు తెలుస్తోంది. సంక్షేమ, అభివృద్ధి పథకాలపై లబ్ధిదారులు, ప్రజల స్పందన, ఎమ్మెల్యేల పనితీరు, పార్టీపరంగా ఇబ్బందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అసమ్మతి నేతలు, అసంతృప్తరాగాలు, ఇలా చాలా ఇష్యూస్‌పై ఇప్పటికే ఓ నివేదిక కేసీఆర్‌కు ఆందినట్లు టాక్‌. బట్‌ ఇప్పుడు…పీకేకు ప్రకాష్‌రాజు కూడా తోడయ్యారు. నేరుగా ఫీల్డ్‌ లెవల్‌కు వెళ్తున్నారు. ఇప్పటి వరకు ఐదు రాష్ట్రాల ఎన్నికలతో కాస్త బిజీగా ఉన్న పీకే అండ్ టీమ్ ఇకపై పూర్తిగా తెలంగాణపైనే ఫోకస్ చేస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా మార్చ్‌ 10న ఫలితాలు వెల్లడైన తర్వాత…వ్యూహాలకు మరింత పదును పెడుతారని సమాచారం. అప్పుడు ఫుల్‌ టీమ్‌తో ఐప్యాక్‌ పూర్తిగా రంగంలోకి దిగుతుందట. ఇప్పటికే ఆ దిశగా ప్లానింగ్ జరిగినట్లు టాక్మొత్తానికి ప్రశాంత్‌కిషోర్‌ ఎంట్రీతో తెలంగాణ పాలిటిక్స్‌ ఒక్కసారిగా రంజుగా మారాయి. ఇప్పటికే తిరుగులేని మెజార్టీతో రెండు సార్లు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన. హ్యాట్రిక్‌ కొట్టడంపై గట్టిగానే ఫోకస్‌ చేస్తోంది. అదే టైమ్‌లో నేషనల్‌ పాలిటిక్స్‌పైనా ఫోకస్ చేస్తోంది. అందుకే ఎన్నికలకు ఇంకా టైమ్ ఉన్నప్పటికీ కాస్త ముందుగానే పనిమొదలు పెట్టేసింది. గులాబీ బాస్ సూచనలు,సలహాల మేరకు….ఐ ప్యాక్‌ టీమ్‌ తన కసరత్తును మరింత ముమ్మరం చేయనున్నట్లు తెలుస్తోంది..ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున రాష్ట్రంతో పాటు దేశంలో కూడా పీకే సర్వే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. గజ్వేల్‌ నుంచే సర్వే ప్రారంభించినట్లు సమాచారం.. టీఆర్‌ఎస్‌ పాలన.. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు.. ఏ పార్టీని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు.. కాళేశ్వరం, దళితబంధు అమలు తీరు తదితర అంశాలపై సర్వే మొదలైనట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ఆరా తీస్తున్నారు. గజ్వేల్‌ తర్వాత రాష్ట్రమంతా సర్వే చేయనున్నారు.మరోవైపు తెలంగాణకు ఇప్పుడు పీకే పీవర్‌ పట్టుకుంది. ఏ నియోజకవర్గంలో చూసిన ఇదే చర్చ. పీకే సర్వే వచ్చేసింది. ఈ నియోజకవర్గంలో ఆయన గెలుస్తారు. ఈ నియోజకవర్గంలో ఈయన ఓడుతారు. ఈసారి ఆయన టికెట్‌ డౌటే అంటూ పీకే సర్వే పేరుతో విస్రృతంగా ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యే, ఎంపి కావాలనుకుంటున్న నేతలకు ఇది తలనొప్పి వ్యవహారంగా తయారైంది. ఈనేపథ్యంలో తెలంగాణలో పీకే టీమ్‌ ఇప్పటికే ఒక సర్వే చేసి కేసీఆర్‌కు అందించిందని, ఆ సర్వేలో సంచలన విషయాలు వెల్లడైనట్లు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు పలువరు ఓడిపోతున్నారని, వాళ్లకు టికెట్‌ డౌట్‌ అంటూ సోషల్‌ మీడియా వేదిక ప్రచారం జరుగుతోంది. ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో తెలియక టీఆర్‌ఎస్‌లో అయోమయం నెలకొంది.ఇది పీకే సర్వే అంటూ మీ అభిప్రాయాన్ని చెప్పాలని కొంతమంది నేతల పేర్లు ఇచ్చి మీ ఓటు ఎవరి వేస్తారని లింక్‌లు పంపుతున్నారు. మరో కొంతమంది పీకే సర్వే ఫలాన జిల్లాల్లో ఈ పార్టీ ఇన్ని సీట్లు గెలుస్తుంది. అన్ని సీట్లు గెలుస్తుందంటూ గ్రాఫిక్‌ ప్లేట్స్‌ పోస్టు చేస్తున్నారు. టిఆర్‌ఎస్‌ వర్గాలు మాత్రం ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏలాంటి సర్వే చేయడంలేదని, పీకే పేరుతో వస్తున్న సర్వేలన్నీ అంబక్‌ అంటున్నారు.వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పావులు కదుపుతున్నారు. ఇంటెలిజెన్స్‌ విభాగం ఇచ్చే నివేదికలతో పాటు ప్రైవేటు సంస్థలతో సర్వే చేయిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ప్రభుత్వ పనితీరును తెలుసుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగా వ్యుహాలను మార్చుకుంటున్నారు. తాను చేయిస్తున్న సర్వేలకు అదనంగా ఇప్పుడు పీకేను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.

Related Posts