తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమలలో శ్రీ మాన్ అనంతాళ్వాన్ వారి యొక్క 968 వ అవతార ఉత్సవం వైభవోపేతంగా ఆదివారం, 6th March నిర్వహించారు. ఈ కార్యక్రమంలో H.H. periyar koil Appan Sri Sathagopa ramanuja periya jeeyar swamy ji TTD మరియు H.H. Sriya koil kelvi Appan శ్రీ గోవింద రామానుజ చిన్న జీయర్ స్వామి వారు, TTD వారి యొక్క మంగళాశాసనములు తో కార్యక్రమం ప్రారంభమైంది. మరియు స్పెషలౕఆఫీసర్ ఇన్చార్జ్ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్, టీటీడీ అనంతాళ్వార్ యొక్క 26 వంశస్థులు శ్రీ టిఏపీ రంగాచార్య గారు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని తిలకించారు. ఇందులో భాగంగా గా శ్రీ పి. వేంకట రామిరెడ్డి గారు రచించిన శ్రీమాన్ అనంతాళ్వార్ దివ్య చరితము (గురు-శిష్య- దైవ సంబంధ నిగూఢ రహస్యొపదేశము) గ్రంథాన్ని ఆవిష్కరించటం జరిగింది. శ్రీ అనంతాళ్వార్ స్వామివారి వంశస్థులు మరియు TTD కార్యకర్తలు, భక్తులు శ్రీ నారాయణ గారు శ్రీ సంజీవరెడ్డి గారు పాల్గొన్నారు. ఆళ్వార్ దివ్య ప్రబంధ స్పెషలాఫీసర్ శ్రీ విజయసారథి గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే భాగ్యాన్ని ఆ భగవంతుడు నాకు కలిగించడం నా పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్నాను. దివ్య గ్రంథ రూపకర్త శ్రీ పి వెంకట రామా రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు.