ఏలూరు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని లింగ వివక్షత లేని సమ సమాజ స్థాపన కొరకు ఈ క్వాలిటీ 3కే రన్ ను నిర్వహించామని జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ అన్నారు. సోమవారం నాడు ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం వద్దగల పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుండి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుండి గవర్నమెంట్ హాస్పిటల్ కోర్టు సెంటర్ ఫైర్ సెంటర్ జడ్పీ ఆఫీస్, యు కలెక్టరేట్ మీదుగా పోలీస్ గ్రౌండ్ చేరింది. ఈ ర్యాలీ లో లో మహిళా చట్టాలను గురించి అవగాహన కలిగిన ఫ్లెక్సీలను మరియు మహిళా సంరక్షణ కొరకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గురించి ప్లే కార్డులను ఈ ర్యాలీ లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ (యత్ర నార్యంతు పూజ్యతే తత్ర దేవత రమంతే) ఎక్కడ అయితే స్త్రీ ని గౌరవిస్తారో. అక్కడ సర్వ దేవతా మూర్తులు నిలయమై ఉంటారు అని, సమాజంలో లింగ వివక్షత లేకుండా ప్రతి ఒక్కరూ సమానముగా జీవించే హక్కును భారత రాజ్యాంగం ద్వారా కలిగి ఉన్నారని, స్త్రీల పట్ల వివక్షతను చూపరాదని అన్నారు.
ఆధునిక సమాజములో మహిళాలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారు అని, గ్రామ వార్డ్ స్థాయిలో అభివృది కొరకు జిల్లాలో 1300 మంది హోం గార్డు మహిళా పోలీస్ సిబ్బంది పని చేస్తున్నట్లూ, శాంతికి మరో రూపమైన స్త్రీ మూర్తి, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా అనేక రకములైన బాధ్యతలను నిర్వహిస్తున్న స్త్రీ మూర్తులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను మార్చి 08 వ తేది నాడు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో సి.ఆర్.రెడ్డి కాలేజీ, సోషల్ వెల్ఫేర్ హాస్టల్, సెంట్ తెరిస్సా కాలేజ్, సెంట్ ఆన్స్ కాలేజ్, సురేష్ బహుగుణ స్కూల్ విద్యార్థినులు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి (మహిళా పోలీస్) ఈ ర్యాలీలో పాల్గొన్నారు