హైదరాబాద్
శాసనసభా సమావేశాలకు ముందు బీజేపీ సభ్యులు ఈటల రాజేందర్, రాజా సింగ్, రఘునందన్ రావులు నల్లకండువాలతో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. సంప్రదాయినికి విరుద్దంగా గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఈటల మాట్లాడుతూ 40 - 50 ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయాలను సీఎం కేసీఆర్ తుంగలో తొక్కి.. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగానికే దిక్కు లేదని... ఎమ్మెల్యేలు ఎంత? అని ఈటల వాపోయారు. స్పీకర్ కుర్చీని అడ్డం పెట్టుకొని తాము మాట్లాడకుండా మైకులు కట్ చేయాలని చూస్తున్నారన్నారు. అసెంబ్లీలో మాట్లాడేందుకు సమయం ఇవ్వకపోతే బయట మీ సంగతి తేలుస్తామన్నారు. ప్రతీ సమస్యపై అసెంబ్లీలో బీజేపీ పోరాడుతోందన్నారు. రాజాసింగ్ మాట్లాడుతూ కేసీఆర్ ది హిట్లర్ పాలన అని అన్నారు. కేసీఆర్ తెలంగాణను అంధకారంలోకి నెట్టిండు. ఆర్థిక బలంతో అహంకారంతో వ్యవహరిస్తున్నాడని.. గతంలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఉండేదన్నారు. గవర్నర్ తమిళి సైని మహిళా అనే అవమానపరిచారని విమర్శించారు. తమ నేతలను ఓడించేందుకు కేసీఆర్ ధన బలాన్ని, అధికార బలాన్ని వాడుకున్నారన్నారు. అసెంబ్లీలో తమ గళాన్ని నొక్కివేయలని చూస్తున్నారన్నారు. ఇది బంగారు తెలంగాణ కాదని.. మత్తుల తెలంగాణ అయిందని రాజాసింగ్ ఆరోపించారు.
మరో ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ ఇంట్లో నుండే పోలీసులు తమ వాహనాలను డైవర్ట్ చేశారన్నారు. కేసీఆర్ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడాలన్నారు. ఆర్ఆర్ఆర్ అసెంబ్లీలో అడుగు పెడుతోందన్నారు.