YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

శాసనసభలో అచ్చెన్నాయుడు తీరుపై సీం జగన్‌ ఆగ్రహం

శాసనసభలో అచ్చెన్నాయుడు తీరుపై సీం జగన్‌ ఆగ్రహం

అమరావతి మార్చ్ 7
ఏపీ శాసనసభలో గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకోవడం పట్ల ఏపీ సీం జగన్‌ టీడీపీ నేత అచ్చెన్నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ సమావేశంలో గవర్నర్‌ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం జరిగింది. స్పీకర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్‌తో పాటు పలువురు మంత్రులు, టీడీపీ నేత అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం ప్రతిపక్ష సభ్యులనుద్దేశించి మాట్లాడుతూ సభలో టీడీపీ వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గవర్నర్‌ మీ పార్టీ కాదు.. మా పార్టీ కాదు. వయసులో అంత పెద్ద వ్యక్తిని అవమానించడం సరికాదు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని ’ జగన్‌ పేర్కొన్నారు.ఈరోజు గవర్నర్‌ ప్రసంగం ప్రారంభం కాగానే ప్రతిపక్ష టీడీపీ సభ్యులు నిరసనలు, నినాదాలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాలని , రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్‌ గో బ్యాక్‌..గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ఏపీ బడ్జెట్‌ ప్రతులను చింపివేశారు. సమావేశం నుంచి వాకౌట్‌ చేసి లాబీలో నిరసనలు తెలిపారు.

విపక్షనేతను వైసీపీ అవమానిస్తోంది శాసనసభలో మండిపడ్డారు టీడీపీ ఉప నేత అచ్చెన్నాయుడు,
ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ విపక్ష, అధికార పక్ష నేతల మధ్య మాటల యుద్ధం హోరెత్తే అవకాశం కనిపిస్తోంది. మూడు సంవత్సరాలుగా టీడీపీ సభ్యులను అవమానాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు శాసనసభలో టీడీపీ ఉప నేత అచ్చెన్నాయుడు. ప్రతిపక్ష నాయకుడుతో పాటు కుటుంబ సభ్యులను సైతం అవమానిస్తున్నారు. శాసనసభా గౌరవాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు మంట గలుపుతున్నారు.కర్తవ్య బాధ్యతను నెరవేర్చడం కోసం టీడీపీ తరపున సభకు హాజరు అవుతున్నాం. శాసనసభలో ఇన్ని ఇబ్బందులు, అవమానాలు ఎప్పుడు ఎదుర్కోలేదన్నారు అచ్చెన్నాయుడు. 30 అంశాలను సిద్ధం చేసి సభకు వెళ్తున్నాం. సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వడం లేదు. శాసనసభను కౌరవ సభగా మార్చారు. మూడేళ్ళలో సభ సజావుగా నడవడం లేదు. సభ గౌరవం పెంచేలా ప్రతిపక్ష పార్టీకి సభలో మాట్లాడే అవకాశం కల్పించాలి.స్పీకర్ వైసీపీ సభ్యుడిగా కాకుండా హుందాగా వ్యవహరించాలి. సభలో మైక్ ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్లం. ప్రభుత్వ ప్రకటనలకు శాసనసభా నిర్వహణపై ఆచరణలో పొంతన ఉండటం లేదన్నారు అచ్చెన్నాయుడు. తొలుత సభకు వెళ్లకూడదని భావించిన టీడీపీ ప్రజా సమస్యల ప్రస్తావనకోసం సభకు వెళ్లాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, సభకు మాత్రం విపక్ష నేత చంద్రబాబునాయుడు హాజరుకావడంలేదు.

టీడీపీ వారికి ఆవేశం ఎక్కువ.. మంత్రి బొత్స సత్యనారాయణ,
టీడీపీ వారికి ఆవేశం ఎక్కువని, క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటారని మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు ఎప్పుడు ప్రజల కోసం, దీర్ఘకాల నిర్ణయాలు తీసుకోరని విమర్శించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి బొత్స నారాయణ సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు స్వార్ధం కోసం నిర్ణయాలు తీసుకుంటారు.ప్రజల కోసం, దీర్ఘకాల నిర్ణయాలు వారు తీసుకోరు.శాసనసభ చట్టాలను చేయవద్దంటే ఎలా కుదురుతుంది. రాజ్యాంగానికి లోబడే వ్యవస్థ అయినా పని చేయాలి. ఇది చర్చనీయాంశం. దీనిపై చర్చ జరగాలి. 2024 వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాదు అని చట్టం చేశారు. శివరామకృష్ణ కమిటీని వేసి రాజధాని నిర్ణయం తీసుకోవాలన్నారు. కానీ చంద్రబాబు నారాయణ కమిటీ వేసి నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకటన ఏదైనా పార్లమెంట్‌కు పంపలేదు. కాబట్టి హైదరాబాదే 2024 వరకు రాజధానే. గత ప్రభుత్వం రాజధాని వ్యవహారం లో చట్టబద్ధంగా వ్యవహరించలేదు.పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేస్తున్నాం’ అని బొత్స తెలిపారు.

Related Posts