YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

షేన్ వార్న్ మరణంపై అనుమానాలు

షేన్ వార్న్  మరణంపై అనుమానాలు

ముంబై, మార్చి 7,
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ఆకస్మిక మరణం క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. థాయ్‌ల్యాండ్‌లోని తన విల్లాలో అచేతనంగా పడి ఉన్న వార్న్‌ ను అతని స్నేహితులు ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఈనేపథ్యంలో గుండెపోటుతోనే లెజెండరీ క్రికెటర్‌ తుదిశ్వాస విడిచాడని వైద్యులు ప్రాథమిక నివేదికలో వెల్లడించారు . కాగా వార్న్‌ హఠాన్మరణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు థాయ్‌ల్యాండ్ పోలీసులు. విచారణలో భాగంగా అతడు బస చేసిన విల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కాగా వార్న్‌ మరణించిన గదిలో ఫ్లోర్‌, టవల్స్‌పై రక్తపు మరకలు గుర్తించామని థాయ్‌ పోలీసులు షాకింగ్‌ విషయాలను బయటపెట్టారు. ఇదే విషయాన్ని ఉటంకిస్తూ థాయ్‌ మీడియా కూడా కథనాలను ప్రసారం చేసింది. దీంతో వార్న్ మృతిపై ఒక్కసారిగా అనుమానాలు రేకెత్తాయి.పోస్టుమార్టం నివేదికలో.. కాగా, వార్న్‌ గదిలో విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించి, ఆస్పత్రికి తరలించడానికి ముందు సీపీఆర్‌ చేశామని..ఈ క్రమంలో అతను రక్తపు వాంతులు చేసుకున్నాడని వార్న్‌ స్నేహితులు ప్రాథమిక విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. థాయ్‌ పోలీసులు కూడా ఇదే చెబుతున్నారు. కాగా ఆదివారం థాయ్‌ అధికారులు వార్న్‌ పార్థివ దేహానికి పోస్ట్‌ మార్టం నిర్వహించారు. ఈ రిపోర్టు సోమవారం వచ్చే అవకాశం ఉంది. వార్న్‌ మరణానికి అసలు కారణాలేంటో పోస్ట్‌మార్టం రిపోర్టులో తేలే అవకాశం ఉంది. కాగా పోస్టుమార్టం అనంతరం ఆదివారమే వార్న్‌ భౌతికకాయాన్ని ఆస్ట్రేలియాకు తరలించనున్నారు. ఇప్పటికే ఆ దేశ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో క్రికెట్‌దిగ్గజం అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం వార్న్‌ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Related Posts