YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వెంకన్నకు పెరుగుతున్న ఆదాయం

వెంకన్నకు పెరుగుతున్న ఆదాయం

తిరుమల, మార్చి 8,
రెండేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన కరోనా ప్రభావం మానవజీవితాలపైనే కాదు.. ప్రముఖ పుణ్యక్షేత్రాలపై కూడా తీవ్రంగా పడింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిని దేశ, విదేశాల భక్తులు భారీగా దర్శించుకునేవారు. రోజూ కోనేటిరాయుడివాడి కొండపై భక్తులతో రద్దీగా ఉండేది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం చేపట్టిన నివారణ చర్యల్లో భాగంగా శ్రీవారి దర్శనానికి కూడా పరిమితులు విధించారు. దీంతో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో స్వామివారి ఆదాయం కూడా తగ్గిపోయింది. అయితే కరోనా వ్యాప్తి నెమ్మదిస్తున్న నేపథ్యంలో తిరుమల స్వామివారి దర్శనానికి నిబంధనలను సడలిస్తూ.. భక్తులకు అనుమతిస్తున్నారు.   దీంతో ఇప్పుడిప్పుడే తిరుమల గిరులపై భక్తుల సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో ఆదివారం కొన్ని నెలల తర్వాత భారీగా హుండీ ఆదాయం లభించిందని టీటీడీ పేర్కొంది.తిరుమలలోని శ్రీవారిని ఆదివారం ఒక్కరోజు 61,052 మంది భక్తులు దర్శించుకున్నారు.  వీరికి 27, 500 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.  వడ్డికాసుల వాడికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా… శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.57 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. మరోవైపు స్వామివారిని సామాన్య భక్తులకు మరింత చేరువడానికి టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అనేక చర్యలు చేపడుతున్నారు. టీటీడీ సిబ్బందికి పలు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా సామాన్య భక్తుల విషయంలో ఓర్పు, సహనంతో వ్యవహరించి దర్శనం చేయించి పంపాలని చెప్పారు.

Related Posts