YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మూడు పై వెనక్కి తగ్గినట్టేనా

మూడు పై వెనక్కి తగ్గినట్టేనా

విజయవాడ, మార్చి 8,
ఇంతకీ, ఏపీ ప్రభుత్వం మనసులో ఏముంది? రాజధాని అమరావతి విషయంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును, ప్రభుత్వం ఆమోదిస్తుందా, లేదు, మూడు రాజధానుల విధానానికే కట్టు బడి ఉంటుందా? ఇప్పుడు ఈ ప్రశ్న మరోమారు ప్రముఖంగా చర్చకు వచ్చింది. నిజమే, న్యాయస్థానం తీర్పు వచ్చిన తర్వాత కూడా, ముఖ్యమంత్రి ‘మూడు’ మారలేదు. అయన మౌనంగానే ఉన్నారు. కానీ’ మంత్రులు, అధికార పార్టీ సీనియర్ నాయకులు, మూడు రాజధానులే మా విధానం అని ప్రకటిస్తున్నారు. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే, ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే, మూడు రాజధానుల తాజా బిల్లు ప్రవేశ పెడతామని చూచాయగా ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా, ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి చేసిన గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా కూడా ఆ ప్రస్తావన లేదు. గడిచిన మూడేళ్లుగా పాలన వికేంద్రీకరణపైనే తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని మాత్రేమే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తమ ప్రసంగంలో పేర్కొన్నారు. అంతేకానీ, మూడు రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, బొత్స, ఇతర మంత్రులు చెపుతున్న మాటను గవర్నర్’తో చెప్పించలేదు. ఆలాగే, మూడు’ కు సంబందించిన తాజా బిల్లును ప్రస్తుత సమావేశాల్లో ప్రవేశ పెడుతున్నామని ఒక్క ముక్కయినా చెప్పలేదు. గవర్నర్ ప్రసంగం అంటే, గవర్నర్ సొంత ఉపన్యాసం కాదు, కాబినెట్ మోదించిన ప్రసంగ పాఠాన్నే గవర్నర్ చదివి వినిపిస్తారు. అంటే, మూడు మీద మంత్రులు ఏమి మాట్లాడినా ప్రభుత్వం ఇంకా ఒక స్థిరమైన నిర్ణయానికి రాలేదని, అందుకే గవర్నర్ ప్రసంగంలో ఆ అంశాన్ని చేర్చలేదని, దాట వేశారని అనుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.  ఆదలా ఉంటే, గవర్నర్ ప్రసంగంపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ, మూడుకు మరో ముడి వేశారు. కోర్టు తీర్పుకు కొత్త భాష్యం చెప్పారు. “2024 వరకు మన రాజధాని హైదరాబాదే. దాన్ని ఆధారంగా చేసుకునే బహుశా కోర్టులు ఆలా మాట్లాడి ఉంటాయి. ఎందుకంటే.. రాజధానిని మేం గుర్తించిన తర్వాత.. చట్టం చేసి.. పార్లమెంట్‌కు పంపి.. అక్కడ ఆమోదం పొందిన తర్వాత తెలుస్తుంది. అయితే అమరావతి, హైదరాబాద్ అని రెండు రాజధానులు లేవు. మా ప్రభుత్వం ప్రకారం అమరావతి అనేది శాసన రాజధాని మాత్రమే” అని బొత్స వ్యాఖ్యానించారు. అయితే, బొత్స సత్యనరాయణ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసినా, ఆయన వ్యాఖ్యలు కొత్త చర్చకు శ్రీకారం చుట్టాయి, నిజానికి, ఇప్పుడు హైదరాబాద్’ ఉమ్మడి రాజధాని అంటే, ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. అసెంబ్లీ భవనాలు సహా, హైదరాబాద్’లో ఉన్న ఉమ్మడి ఆస్తులు చాలా వరకు  జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వానే తెలంగాణకు ప్రభుత్వానికి ధారాదత్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ భవనాన్ని కూల్చి వేసి, కొత్త భవనాలు కట్టుకుంటోంది. సో... హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనుకోవడం, ఆ విధంగా ప్రకటనలు చేయడం అయితే, మంత్రి బొత్స అజ్ఞానం అయినా అవుతుంది, కాదంటే, అటూ ఇటూ ఏటూ తేల్చుకోలేక చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం అయిన కావచ్చునని పరిశీలకులు అంటున్నారు. అయితే, బొత్స వ్యాఖ్యలు ఏపీలోనే కాదు, తెలంగాణలోనూ హాట్ టాపిక్ అయ్యాయి.ఇటీవల ప్రధాని లోక్ సభలో రాష్ట్ర విభజనకు సంబంధించి చేసిన ప్రసంగాన్ని, తెరాస నాయకత్వం తెలంగాణ సెంటిమెంట్’ను రాజేసేందుకు ప్రయత్నించింది. ఇప్పుడు బొత్స ప్రకటనను కూడా అలాగే, ఉపయోగించుకున్నా ఉపయోగించుకుంటుంది, అంటున్నారు.

Related Posts