కర్నాటక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లింగాయత్‌లకు మైనారిటీ హోదా కల్పిస్తామని ప్రకటించి, వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించింది. బీజేపీకి మద్దతు పలుకుతున్నలింగాయత్‌లు కాంగ్రెస్ వైపు తిరిగితే మరోమారు గద్దెనెక్కవచ్చని కాంగ్రెస్ భావించింది. అయితే ప్రస్తుతం వెలువడుతున్న ఎన్నికల ఫలితాలు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. లింగాయత్‌ల ప్రభావం ఉన్న 37 సీట్లలోనూ ఇప్పుడు బీజేపీ విజయం దిశగా దూసుకుపోయింది. దీనికితోడు ఎంతోకాలంగా కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతున్న ముస్లిం వర్గం కూడా ఈసారి బీజేపీకి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.