YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జోరుమీద జనసేనాని

జోరుమీద జనసేనాని

హైదరాబాద్, మార్చి 8,
మూడేళ్లు-ఆరు సినిమాలు…! ఇదీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చినప్పుడు పవర్‌స్టార్ వేసుకున్న పర్‌ఫెక్ట్ స్కెచ్. ఆవిధంగా మూడొందల కోట్ల దాకా సంపాదించుకుని నెక్స్ట్ ఎలక్షన్స్‌ కోసం వినియోగించుకుంటానని సన్నిహితుల దగ్గరే చెప్పుకున్నారట. మొదట్లో కోవిడ్ కారణంగా పీకే కాలిక్యులేషన్‌ తప్పినట్టు కనిపించినా… తర్వాత గాడిన పడిందిరీఎంట్రీ తర్వాత వచ్చిన రెండు పవన్ సినిమాలూ సక్సెస్ సౌండ్ ఇచ్చినవే. వకీల్‌సాబ్ బాక్సాఫీస్‌ లెక్క 150 కోట్ల మార్క్‌ దగ్గరికొచ్చి ఆగింది. ఇప్పుడు భీమ్లానాయక్ అయితే… 100 కోట్ల షేర్ తీసుకున్న మొట్టమొదటి పవన్ సినిమాగా చరిత్రకెక్కబోతోంది. వసూళ్ల పరంగా పవర్‌స్టార్‌కి కెరీర్‌బెస్ట్ కాబోతోంది. కోవిడ్ ఫియర్స్‌నీ, ఆక్యుపెన్సీ లిమిటేషన్స్‌నీ దాటుకునిమరీ విజయవంతమయ్యాయి ఈ రెండు సినిమాలు.నెక్స్ట్ రాబోయే మూవీ హరిహర వీరమల్లుపై ఈ ప్రెజర్ ఎలాగూ వుంటుంది. పవర్‌స్టార్‌కి హ్యాట్రిక్ హిట్ ఇచ్చేతీరాలన్న కమిట్‌మెంట్‌తో ఈ మూవీకి మెరుగులు దిద్దుతున్నారు డైరెక్టర్ క్రిష్. ఈ గ్యాప్‌లోనే పవన్‌ కోసం చీప్ అండ్ బెస్ట్‌లో రెండు రీమేక్ సినిమాల్ని వర్కవుట్ చేస్తున్నారు త్రివిక్రమ్. మొదటి రెండు సినిమాలకొచ్చిన వసూళ్లు… పవన్ మార్కెట్ తగ్గలేదన్న క్లారిటీనిచ్చేశాయి కనుక… ఇకనుంచి చిన్న బడ్జెట్‌తో పెద్ద రెవిన్యూ రాబట్టే ఆలోచనలో వున్నారు మేకర్స్.తన పేరుమీదున్న పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్ వర్క్స్‌ బేనర్‌ని కూడా యాక్టివేషన్‌లోకి తీసుకొస్తున్నారు పవర్‌స్టార్. హైదరాబాద్‌లో పాతిక్కోట్ల ఖర్చుతో స్థలం కొని కొత్త కార్యాలయం కట్టే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. టీజీ విశ్వప్రసాద్‌తో కలిసి పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బేనర్‌తో సంయుక్తంగా డజను దాకా సినిమాలు నిర్మించాలన్న పాత ఆలోచనను కూడా రీకాల్ చేసుకుంటున్నారు పవన్.భీమ్లానాయక్‌ హిందీ వెర్షన్ రిలీజ్ అయితే నార్త్‌లో కూడా పవన్ మార్కెట్‌ ఎంతన్నది తెలిసిపోతుంది. ఒకవైపు ఏపీలో ఎన్నికల సీజన్ సమీపిస్తుండడంతో… ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి బైటపడ్డానికి సినిమా వైపు ఇలా వేగంగా ఆలోచిస్తున్నారు పవన్. రాబోయే ఏడాదిన్నర పాలిటిక్స్‌లో కంటే ఫిలిమ్ సర్కిల్స్‌లోనే మోస్ట్ హ్యాపెనింగ్‌గా వుండబోతున్నారన్నది పవన్ కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న ఇన్నర్‌ న్యూస్.

Related Posts