YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఫిల్మ్ అవార్డ్స్ ఎఫెక్ట్ తో స్మృతికి షాక్

  ఫిల్మ్ అవార్డ్స్ ఎఫెక్ట్ తో స్మృతికి షాక్

రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ తో పెట్టుకుంది కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. అంతే తమ శాఖనే కోల్పోవాల్సి వచ్చింది. భారత ప్రధమ పౌరుడు పేరు పోయేలా వ్యవహరించిన తీరు వివాదాన్ని రేపింది. అందుకే సమాచార శాఖ నుంచి తప్పించి కేవలం జౌళి శాఖకే స్మృతినీ పరిమితం చేశారు. గతంలో మానవ వనరుల అబివృద్ది శాఖను నిర్వహించారామె. అక్కడ సరిగా పని చేయలేదనే కారణంతో ఆశాఖ నుంచి తప్పించారు. ఆమె మారుతుందనే ఆలోచనతో వెంకయ్య నాయుడు నిర్వహించిన సమాచార శాఖను స్మృతికి ఇచ్చారు. అయినా సరే పరిస్థితిలో మార్పు రాలేదు.  కళాకారులు అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ఆమె రసాభాసాగా మార్చింది. అసలు అవార్డులు తీసుకునేందుకే ప్రముఖులు రాలేదు. ఫలితంగా ఆమె శాఖకే ఎసరు వచ్చింది. మరోసారి ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం అయితే ఏకంగా మంత్రి పదవికే ఎసరు వస్తుందని హెచ్చరించినట్లు అయింది. ఇప్పుడు సమాచార శాఖను కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న రాజ్యవర్దన్ కు అప్పగించారు. క్రీడల మీద బాగా అవగాహన ఉన్న రాజ్యవర్దన్ సమాచారశాఖలో రాణించాలి. లేకపోతే ఇబ్బంది పడక తప్పదు. సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. అలాంటి సమయంలో సమాచారశాఖ చాలా కీలకం. అన్ని వర్గాలను ఏకం చేయాలి. తమకు అనుకూలంగా మలచాలి. అదే కేంద్ర ప్రభుత్వ పెద్దల ప్రణాళిక. వారి ఆలోచనలకు అనుగుణంగా స్మృతి ఇరానే నడుచుకోపోవడంతోనే ఇబ్బంది వచ్చిందంటున్నారు. కేవలం అవార్డుల ఫంక్షన్ సరిగా నిర్వహించలేదనే కారణంతోనే ఆమె శాఖను మార్చలేదంటున్నారు. మీడియా పెద్దలు కొందరు స్మృతి పై ఫిర్యాదు చేశారని.. అందుకే ఇక లాభం లేదని మార్చినట్లు చెబుతున్నారు. ఇంకోవైపు అనారోగ్యంతో ఆసుపత్రికి పరిమితమయ్యారు అరుణ్ జైట్లీ. ఆయన కోలుకునే వరకు పియోష్ గోయల్ ఆర్దిక శాఖను కూడా చూస్తారు. కేంద్ర కేబినెట్‌లో కీలక మార్పులు చోటుచేసుకోవడం ఇప్పుడు హాట్ టాపికైంది. మరోవైపు ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిగా అహ్లువాలియాను నియమించి మార్పులకు శ్రీకారం చుట్టడం ఎన్నికల వ్యూహమే నంటున్నారు.  

Related Posts