YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వివేకా కేసు... రంగంలోకి ఈడీ

వివేకా కేసు... రంగంలోకి ఈడీ

కడప, మార్చి 9,
వివేకా హత్య కేసులో సీబీఐ బాగా స్పీడ్ పెంచింది. ఆ క్రమంలో ఈ కేసులో పాత్రధారులే కాదు.. సూత్రదారుల పని పట్టేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందీ సీబీఐ. ఆ క్రమంలో రేపోమాపో.. ఈ కేసు దర్యాప్తు కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా రంగంలోకి దిగనున్నారని సీబీఐ స్పష్టం చేస్తోంది. ఇప్పటికే వివేకా హత్యకు 40 కోట్ల రూపాయిల సుపారీ అంటూ ఈ కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తాగిరి.. సీబీఐ అధికారుల ఎదుట వాగ్మూంలం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో నిందితుల నుంచి ఈ నగదు వివరాలు సేకరించేందుకు ఈడీ అధికారులు రంగంలోకి దిగి.. సుపారీ లెక్క తేల్చే పనిలో ఉన్నారని తెలుస్తోంది. 2019, ఫిబ్రవరి 10న వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి ఇంట్లోనే స్కెచ్ వేశారని సీబీఐకి దస్తాగిరి చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాలుగు రోజులకు అడ్వాన్స్ కింది.. సునీల్ యాదవ్.. కోటి రూపాయలు తీసుకు వచ్చి తనకు ఇచ్చారని.. దస్తాగిరి తెలిపారు. అయితే ఈ డబ్బులు సునీల్ యాదవ్‌కు ఎవరిచ్చారు.  వాళ్లకు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే అంశాలపై ఇఫ్పటికే సీబీఐ ఆరా తీసింది. సుపారీ సొమ్ముపై ఓ స్పష్టత వస్తే.. ఈ అసలు కుట్రకు సూత్రధారులు ఎవరో తెలిపొతోందని సీబీఐ ఆలోచిస్తుంది. మరోవైపు వివేకా హత్యకు సుపారీగా చెల్లించిన నగదును నిందితులకు ఎవరిచ్చారు? అంత మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? ఇత్యాది అంశాలపై సీబీఐ ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించింది. వివేకాను చంపితే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి 40 కోట్ల రూపాయిలు ఇస్తారని .. అందులో 5 కోట్లు తనకు ఇస్తారని ఎర్రగంగిరెడ్డి చెప్పినట్లు దస్తాగిరి.. సీబీఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టం చేశారు. వివేకానందరెడ్డిని చంపేయి.. నీతో మేము వస్తామని.. ఈ హత్య కుట్ర వెనుక వైయస్ అవినాష్ రెడ్డి, వైయస్ భాసర్కరెడ్డి, వైయస్ మనోహర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వంటి పెద్ద వాళ్లు ఉన్నారని ఎర్రగంగిరెడ్డి.. తనతో చెప్పారని దస్తాగిరి.. సీబీఐ వాంగ్మూలంలో పేర్కొన్నారు.  అయితే దస్తాగిరితో గంగిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు... సుపారీ సొత్తుకు ఎలాంటి సంబంధం ఉంది అనే అంశంపై కూడా సీబీఐ దృష్టి పెట్టింది. ఇక ఈ కేసులో ఇతర నిందితులకు అడ్వాన్స్ చెల్లింపులు జరిగాయా? జరిగితే అవి ఎక్కడి నుంచి ఎలా వచ్చాయనే కోణంలో సీబీఐ ఆరా తీస్తోంది. ఆర్థిక మూలాల లెక్క తేల్చేందుకు ఈడీ అధికారులు రంగంలోకి దిగాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే వివేకా హత్యకు ముందు.. ఆ తర్వాత ఎంత మొత్తం చేతులు మారిందనే అంశాలపై కూడా సీబీఐ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అలాగే నిందితులకు అడ్వాన్స్‌గా చెల్లించిన నగదు ఎక్కడి నుంచి వచ్చింది? వాటి వెనుక ఉన్న ఆర్థిక మూలలుపై కొన్ని ఆధారాలు సైతం సీబీఐ ఇప్పటికే సేకరించింది. వాటిని ఈడీ అధికారులకు ఇవ్వడం వల్ల.. వారి పని కొంత సులువు అవుతోందనే భావనలో సీబీఐ ఉంది. అయితే ఈడీ అధికారులు రంగంలోకి దిగుతున్నారనే టెన్షన్‌లో ఈ హత్య కేసులో సూత్రధారులు ఉన్నారని తెలుస్తోంది. ఈ వివేకా హత్య కేసులో ఏ నిమిషం.. ఏం జరుగుతుందో.. ఎవరిని అరెస్ట్ చేస్తారో అనే భయం గుప్పెట్లోకి కడప జిల్లా జారిపోయింది.

Related Posts