YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బీజేపీలో గోషమహల్ చిచ్చు

బీజేపీలో గోషమహల్ చిచ్చు

హైదరాబాద్, మార్చి 9,
తెలంగాణ బీజేపీలో కొత్త చిచ్చు రాజుకుంది. ఆ పార్టీ నేత‌ల మ‌ధ్య నియోజకవర్గ స‌ర్దుబాటు ఇబ్బందిక‌రంగా మారింది. త‌మ స్థానాల‌ను ప‌దిలం చేసుకునే ప‌నిలో నేతలు చర్యలు ముమ్మరం చేశారు. తాజాగా గోషామ‌హాల్‌  కు జ‌హీరాబాద్‌కు అధిష్టానం లింకు పెట్టింద‌ని చర్చలు రావడం ఆసక్తిగా మారింది. ఇంత‌కీ హైద‌రాబాద్ జిల్లాలో ఉన్న గోషామ‌హ‌ల్‌కు, సంగారెడ్డి జిల్లాలో ఉన్న జ‌హీరాబాద్‌  కు ఉన్న లింకేటీ ?. హైద‌రాబాద్(మ‌హాన‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న గోషామ‌హాల్ నియోజ‌క‌వ‌ర్గం బీజేపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎంఐఎం పార్టీ కేంద్ర కార్యాల‌యం దారుస‌లాం ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర కార్యాల‌యాలు ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ ప్రస్తుతం బీజేపీ శాస‌నస‌భా ప‌క్ష నేత‌గా వ్యవ‌హ‌రిస్తున్నారు. రాజాసింగ్‌కు ప్రస్తుతం కొత్త చిక్కువ‌చ్చిప‌డింది. గ‌త మున్సిప‌ల్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కాంగ్రెస్ నేత‌ విక్రమ్ గౌడ్‌.. కాషాయ కండువా క‌ప్పుకున్నారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి త‌న‌కు అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని భ‌రోసా ఇవ్వడంతోనే బీజేపీలో చేరిన‌ట్లు విక్రమ్‌గౌడ్ చెబుతున్నారు.గోషామ‌హ‌ల్‌ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ రెండు వ‌ర్గాలుగా చీలిపోయింది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌హీరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీచేయాల‌ని అధిష్టానం సూచించింద‌ని సమాచారం. ఎంపీగా పోటీ చేయ‌డానికి ఆర్థిక వ‌న‌రులు అంత‌గా లేవ‌ని, గోషా మ‌హ‌ల్ నుంచే ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాన‌ని రాజాసింగ్ అంటున్నారు. ఇక గోషామ‌హాల్ పై ఆశ‌లు పెట్టుకున్న విక్రమ్ గౌడ్ ప‌రిస్థితి కూడా ఇబ్బందిక‌రంగా మారింది. పార్టీ అధిష్టానం ఎలాంటి బాధ్యత‌లు అప్పగించ‌క‌పోవ‌డంతో భ‌విష్యత్‌పై విక్రమ్‌గౌడ్‌ ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు.టీఆర్ఎస్ ప్రభంజనంలోనూ గోషామ‌హ‌ల్ అసెంబ్లీ స్థానంపై కాషాయ‌ జెండా ఎగిరింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి బ‌ల‌మైన అభ్యర్థులు లేక‌పోవ‌డం క‌లిసొస్తుంద‌ని క‌మ‌ల‌నాథులు భావిస్తున్నారు. ఎంఐఎం ప్రధాన కార్యాల‌యం ఇక్కడే ఉన్నా… మైనార్టీ ఓట్లు భారీగా ఉన్నా.. ప‌తంగి పార్టీ మాత్రం ఇక్కడి నుంచి పోటీచేయ‌క‌పోవ‌డం విశేషం. అయితే విక్రమ్ కోసం డీకే అరుణ ఫైట్ చేయడానికి రెడీ ఉన్నా రాజాసింగ్ కు బండి సంజయ్ మద్దతు ఉంది. ఎన్నికల నాటికీ ఇది బీజేపీలో పెద్ద వివాదం అవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Related Posts