గొల్లపూడి
మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరావును పోలీసులు వరుసగా రెండో రోజు కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మైలవరం రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని అఖిలపక్షం పిలుపునిచ్చిన జి.కొండూరు బంద్ కార్యక్రమానికి బయలుదేరనివ్వకుండా దేవినేని ఉమాను గొల్లపూడి లో పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి నిలిపివేశారు.
మరోవైపు జి కొండూరు బంద్‌కు మైలవరం రెవిన్యూ డివిజన్ పోరాట సాధన సమితి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బంద్‌కు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఎమ్మార్పీఎస్‌లు మద్దతు తెలిపాయి. కాగా... బంద్‌కు అనుమతులు ఇవ్వని పోలీసులు... దుకాణలను బలవంతంగా ముసివేయిస్తే అరెస్ట్‌లు చేస్తామని నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. అయితే పోలీసులు ఎన్ని అడ్డంకులు కలిగించినా జి.కొండూరు బంద్‌ను విజయవంతం చేస్తామని సాధన సమితి నాయకులు స్పష్టం చేశారు. పోలీసుల నిరంకుశ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.