హైదరాబాద్
ప్రభుత్వంపై అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసారు. బుధవారం నాడు అయన మాట్లాడుతూ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి మూడేళ్ళ నుంచి ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఆరోగ్యశాఖలో ప్రభుత్వం చెప్తునంత పనితీరు లేదు. టీమ్స్ హాస్పిటల్ ఘనంగా ఓపెన్ చేసి ఎందుకు మూసివేశారో తెలీదు. మెడికల్ కాలేజీల అంశంలో ప్రభుత్వం లెక్కలు తప్పు చెప్తోంది. అభినందనలు మాత్రమే కాదు- విమర్శలను సైతం ప్రభుత్వం సానుకూలంగా తీసుకోవాలి. ప్రభుత్వం మంచి చేస్తోంది- కానీ ఇంకా చేయాల్సి ఉంది. వచ్చే ప్రభుత్వం టీఆరెస్ దే- మేము కలిసి పనిచేస్తాం. బంగారు తెలంగాణ అభివృద్ధిలో టీఆరెస్ తో ఎంఐఎం కలిసి ముందుకు వెళదామని అయన అన్నారు.