YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కన్నడ నాట పనిచేయని రాహుల్ లాజిక్

కన్నడ నాట పనిచేయని రాహుల్ లాజిక్

2014 సార్వత్రిక ఎన్నికలప్పుడు కాంగ్రెస్ మీద ఉన్న తీవ్రమైన వ్యతిరేకతతో ప్రజలు మోడీకి పట్టం కట్టారు. కానీ మోడీ వచ్చాక..దేశం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయిందన్నది చాలా మంది అభిప్రాయం. మోడీ దూకుడికి కళ్లెం వేయాలంటే కన్నడ ఎన్నికల్లో ఓడించమే కరెక్ట్ అని ప్రచారం చేస్తూ దూసుకెళ్తోంది కాంగ్రెస్. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మరోసారి కర్నాటక అధికార పీఠమెక్కితే... ఆ పార్టీ గ్రాఫ్‌తో పాటు.. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గ్రాఫ్‌ కూడా పెరుగుతుందని భావించింది. కానీ కాంగ్రెస్ ఆశలపై కన్నడ ప్రజలు నీళ్లు జల్లారు. రెండేళ్ల కిందట బీహార్లో.. 26 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడంతో కాంగ్రెస్‌ పునరుజ్జీవం మొదలైంది. ఆ తర్వాత పంజాబ్‌ను దక్కించుకుని... కాంగ్రెస్‌ కి ఇంకా ఫ్యూచర్ ఉందని నిరూపించారు. గోవా, మణిపూర్లలో కూడా.. బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకుని తమ సత్తా తగ్గలేదని నిరూపించారు.  ఆపై మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో మోడీకి గట్టి పోటీ ఇచ్చిన రాహుల్‌ తన గ్రాఫ్ పెంచుకున్నాడు. అదే ఊపుతో కర్నాటకలో కూడా దాదాపుగా రెండు నెలలుగా మకాం వేసిన రాహుల్ జోరుగా ప్రచారం చేశారు. ఎక్కడికక్కడ బీజేపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపంచారు.కానీ అవేవి రాహుల్ కు కలిసిరాలేదు.  మెజార్టీ కాదు కదా... కనీసం హంగ్ ఏర్పడితే వేరే పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటంత మెజార్టీ స్థానాల్ని కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది, దీంతో కర్నాటకపై హస్తం నేతలు  వేసుకున్న లెక్కలన్నీ తారుమారయ్యాయి. గతేడాది నుంచి రాహుల్‌ కర్నాటక మీద దృష్టి పెట్టాడు. ఒక్క కర్నాటకలో కాంగ్రెస్‌ గెలిస్తే.. దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని భావించాడు.  కొన్నేళ్లుగా అనారోగ్యంతో పార్టీ కార్యకలాపాలకు దూరమైన సోనియా గాంధీ, ఇటీవలే మరోసారి కాంగ్రెస్‌ మార్క్‌ రాజకీయాలకు తెర తీశారు. 17 ప్రాంతీయ పార్టీలతో కలసి యాంటీ బీజేపీ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం శ్రీకారం చుట్టారు. కర్నాటకలో ఆమె ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. కానీ సోనియా వ్యూహాలు... రాహుల్ లాజిక్ లు ఏవీ కర్నాటకలో వర్కవుట్ కాలేదు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. తానే ప్రధాని మంత్రిని అవుతానని రాహుల్‌ కూడా కన్నడ ప్రచారంలో చెప్పుకొచ్చారు. రాహుల్‌ గాంధీలో ఇంత కాన్ఫిడెన్స్ ఎప్పుడూ చూడలేదు. రాహుల్ లో వచ్చిన ఈ ధీమాతో రాజకీయ విశ్లేషకులుసైతం ఈసారి కన్నడ నాట కాంగ్రెస్ జెండా ఎగరడం ఖామయని భావించారు. మోడీ గ్రాఫ్ తగ్గుతుందని ఊహించారు. కానీ అందరి ఊహలు తలకిందులయ్యాయి. కాంగ్రెస్ ను ఓడించి ప్రజలు కమలానికే పట్టం కట్టారు. మోడీ హవా ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ  వంటి పార్టీలు వైదొలగడంతో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కి అటూ ఇటుగా ఉందని మిగిలిన పార్టీలతో సహా కాంగ్రెస్ నేతలు సైతం భావించారు. ఇలాంటి టైంలో కన్నడ పీఠాన్ని గెలుచుకుని... రాహుల్ గాంధీ వచ్చే ఏడాదిలోగా మోడీకి వ్యతిరేకంగా దూసుకెళ్తాడని భావించారు. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా కచ్చితంగా ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూసింది. కానీ పార్టీలో పొరపాట్లో.... అక్కడున్న ప్రభుత్వంపై వ్యతిరేకతో తెలియదు... కానీ... కాంగ్రెస్ మాత్రం కర్నాటకలో చిత్తుగా ఓడిపోయింది. రాహుల్ గాంధీ పెట్టుకున్న ఆశలన్నింటిని ఆవిరి చేసింది. 

Related Posts